11 ఏళ్లు, 143 మంది..5 వేల సార్లు అత్యాచారం..పంజాగుట్ట పీఎస్ లో కేసు

  • Published By: madhu ,Published On : August 22, 2020 / 07:38 AM IST
11 ఏళ్లు, 143 మంది..5 వేల సార్లు అత్యాచారం..పంజాగుట్ట పీఎస్ లో కేసు

11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది. 42 పేజీలతో ఇది ఉంది. 138 మంది ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులంటూ పోలీసులు రిజిస్టర్‌ చేశారు.



వివరాల్లోకి వెళితే…
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం గ్రామానికి చెందిన యువతికి (25) 2009లోనే వివాహమైంది. అత్తింటిల్లో శారీరకంగా, మానసికంగా వేధించారు. 9 నెలల తర్వాత ఈ విషయాన్ని పుట్టింటి వారికి తెలియచేసింది. 2010లో భర్త నుంచి విడాకులు తీసుకుని పుట్టింటిలో ఉంటూ..చదవడం ప్రారంభించింది.

ఓ విద్యార్థి సంఘం నాయకుడు తనపై అత్యాచారం చేశాడని. నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని వెల్లడించారు. గడిచిన 11 ఏళ్లలో అనేక మంది నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు తనను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లారని, వారితోపాటు స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు కలిసి తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.



5 వేల సార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని, వీళ్లంతా తన ఫొటోలు, వీడియోలు యూట్యూబ్‌లో పెడతానని భయపెట్టేవారని, బలవంతంగా అఘాయిత్యాలకు పాల్పడ్డారని పోలీసుల వద్ద వాపోయింది. తాము చెప్పినట్లు వినకపోతే గన్‌తో కాల్చేస్తామని, ముఖంపై యాసిడ్‌ పోస్తామని కొందరు బెదిరించేవారని, తనతో కూడా బలవంతంగా మద్యం తాగించేవారని, కొన్ని సందర్భాల్లో తాను గర్భవతిని అయ్యానని, ఆ దుండగులే బలవంతంగా గర్భం తీయించారని తెలిపింది.

బాధలు భరించలేకపోయిన తాను గాడ్‌ పవర్‌ ఫౌండేషన్‌ సంస్థ వారిని కలిశానని, వారిచ్చిన ధైర్యం, సహకారంతోనే పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. ఈ మేరకు 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.