Fire Accident 12 Killed : నైజీరియా నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.

huge fire
Fire Accident 12 Killed : నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. పలు వాహనాలు దగ్ధం అయ్యాయి. ఆయిల్ రిఫైనరీ కర్మాగారానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఆయిల్ పైప్ లైన్ కు రంధ్రం ఏర్పడి మంటలు చెలరేగాయి. గంటల తరబడి ఎగిసిపడిన మంటల ధాటికి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర జకార్తాలోని తనహ్ మెర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది.
Fire Broke Out : అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి 13మంది సజీవదహనం
భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత ఇది అనేక పేలుళ్లకు కారణమైంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటినా ఖాళీ చేయించారు. భారీ అగ్ని ప్రమాదంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.