14 రోజులు రిమాండ్ : వరంగల్ సెంట్రల్ జైలుకి సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు బుధవారం (మే 1,2019) భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 12:53 PM IST
14 రోజులు రిమాండ్ : వరంగల్ సెంట్రల్ జైలుకి సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు బుధవారం (మే 1,2019) భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.

హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు బుధవారం (మే 1,2019) భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. మర్రి శ్రీనివాస్ రెడ్డిపై 302, 326, 201, 203, 376 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ముగ్గురు బాలికల హత్య కేసులో శ్రీనివాస్ నిందితుడు.
Also Read : ఆ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ సవరించండి… సీఈసీకి ఏపీ సీఎం లేఖ

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామంలో బాలికల వరుస హత్యలు కలకలం రేపాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి, డిగ్రీ విద్యార్థిని మనీషా, 6వ తరగతి బాలిక కల్పనలను.. శ్రీనివాస్ రెడ్డి అత్యంత కిరాతకంగా చంపాడు. మృతదేహాలను పాడుబడిన వ్యవసాయ బావిలో పూడ్చిపెట్టాడు. వరుస హత్యలు సంచలనం రేపాయి. హాజీపూర్ గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేశాయి. లిఫ్ట్ ఇస్తానని బైక్ పై అమ్మాయిలను ఎక్కించుకుని బావి దగ్గరికి తీసుకెళ్లి వారిపై అత్యాచారం చేసిన హతమార్చాడని పోలీసుల విచారణలో తేలింది.

స్కూల్ కి వెళ్లిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురి కావడం, బావిలో మృతదేహం లభ్యం కావడంతో.. ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ముగ్గురు అమ్మాయిలను చంపింది తానే అని శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్ రెడ్డి పై హాజీపూర్ గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. కిరాతకుడిని ఉరి తియ్యాలని కొందరు, నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చెయ్యాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర