అమెరికా పనామా జైల్లో కాల్పులు..14 మంది మృతి

  • Published By: madhu ,Published On : December 19, 2019 / 05:09 AM IST
అమెరికా పనామా జైల్లో కాల్పులు..14 మంది మృతి

అమెరికాలో మరలా కాల్పుల కలకలం రేగింది. ఖైదీల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడడంతో 14 మంది చనిపోయారు. ఈ ఘటన సెంట్రల్ పనామా జైలులో చోటు చేసుకుంది. వెంటనే తెలుసుకున్న జైలు అధికారులు, పోలీసులు గాయపడిన 15 మందిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఖైదీల దగ్గర 5 తుపాకులు, ఏకే -47 రైఫిల్స్ దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అసలు తుపాకులు జైల్లోకి ఎలా వెళ్లాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఈ ఘటన డిసెంబర్ 17వ తేదీ మంగళవారం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. అతిపెద్ద జైళ్లలో పనామ నగరంలోని లాజొయితా జైలు ఒకటి. హాల్ 14లో మంగళవారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

హాల్‌లో మొత్తం 500 మంది ఖైదీలున్నారని, ఇరు వర్గాలు కాల్పులకు దిగారని పేర్కొంది. ఇందులో క్రిమినల్ గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నారని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ పోలీస్ అలెక్సిస్ తెలిపారు. కొద్ది వారాల క్రితం జైలులో తనిఖీలు నిర్వహించిన సమయంలో ఆయుధాలు కనుగొనబడ్డాయని పనామా అధ్యక్షుడు వెల్లడించారు.