Poison Injection : బిడ్డ బాధ చూడలేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య

కుమారుడికి క్యాన్సర్ రావడంతో చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తిప్పాడు ఆ తండ్రి. ఎంతకు తగ్గకపోగా.. రోజు రోజుకు దాని తీవ్రత అధికమై శరీరం మొత్తం పాకింది.

Poison Injection : బిడ్డ బాధ చూడలేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య

Poison Injection

Poison Injection : కుమారుడికి క్యాన్సర్ రావడంతో చికిత్స కోసం అనేక ఆసుపత్రులకు తిప్పాడు ఆ తండ్రి. ఎంతకు తగ్గకపోగా.. రోజు రోజుకు దాని తీవ్రత అధికమై శరీరం మొత్తం పాకింది. దీంతో ఆ బాలుడు ఆ బాధ భరించలేక కేకలు వేస్తూ అర్థనాదాలు చేసేవాడు. అతడి బాధ చూడలేని తండ్రి కుమారుడిని కారుణ్య హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

Read More : Illegal Marriages : ఒకరికి తెలియకుండా ఒకరిని… నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న తమిళ తంబి

వివరాల్లోకి వెళితే సేలం జిల్లా ఎడపాడి సమీపంలోని కొంగనాపురం కరుసవల్లి గ్రామానికి చెందిన పెరియ స్వామి లారీ డ్రైవర్.. ఆయనకు వన్నతమిళ్ (14) కుమారుడు ఉన్నాడు. గతేడాది వన్నతమిళ్ కుడి కాలిలో ఓ కణితి కనిపించింది. దీంతో పెరియ స్వామి.. కుమారుడిని తీసుకోని ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు చూపించాడు. ఇది క్యాన్సర్ గడ్డగా తేల్చారు వైద్యులు. దీనికి కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తదుపరి తరచూ చికిత్సకు తీసుకెళ్తూ వస్తున్నారు.

వైద్యం అందిస్తున్నప్పటికి క్యాన్సర్ తగ్గకపోగా శరీరం అంతా వ్యాపించింది. ఆ కణితి భాగం చీము పట్టడంతో వన్న తమిళ్ పడుతున్న నరకాన్ని చూసి తండ్రి పెరియ స్వామి తట్టుకోలేకపోయాడు. ఆ వేదన నుంచి కుమారుడికి విముక్తి కల్గించేందుకు నిర్ణయించారు. ఓ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమీప బంధువు ప్రభు సాయం తీసుకున్నాడు. ఆదివారం రాత్రి విషం ఇంజెక్షన్‌ ను ఆ బాలుడికి వేశారు. నిద్రలోనే బాలుడు మరణించాడు. సోమవారం ఉదయాన్నే కేన్సర్‌ కారణంగా మరణించినట్టు ఇరుగు పొరుగు వారిని నమ్మించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.

Read More : Nobel Prize In Physics : భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

అయితే, పోలీసులకు ఆ బాలుడిని కారుణ హత్య చేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పెరియ స్వామి, ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నారు. కాగా కారుణ్య మరణం కోసం కోర్టు అనుమతి అవసరం ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండా ఇటువంటి వాటికి పాల్పడితే హత్యానేరం కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది.