Dalits Tortured: అప్పు తీర్చలేదని 16 మంది దళితుల్ని బంధించిన యజమాని.. .. బిడ్డను కోల్పోయిన గర్భిణి

తీసుకున్న అప్పు చెల్లించలేదని ఒక యజమాని తన దగ్గర పని చేసే కూలీలపై అమానుషానికి పాల్పడ్డాడు. 16 మంది దళితుల్ని ఒకే గదిలో బంధించి తాళం వేశాడు. దాదాపు 15 రోజులు చిత్ర హింసకు పాల్పడ్డాడు.

Dalits Tortured: అప్పు తీర్చలేదని 16 మంది దళితుల్ని బంధించిన యజమాని.. .. బిడ్డను కోల్పోయిన గర్భిణి

Dalits Tortured: కర్ణాటకలో దారుణం జరిగింది. తీసుకున్న డబ్బు చెల్లించలేదని, తన దగ్గర పని చేసే 16 మంది దళితుల్ని ఒక గదిలో వేసి తాళం వేశాడు యజమాని. వారిలో ఉన్న ఒక గర్భిణి తన బిడ్డను కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక, చిక్కమగళూరుకు చెందిన జగదీష గౌడ అనే వ్యక్తి బీజేపీకి చెందిన నేత.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

అతడికి కొన్ని కాఫీ ప్లాంట్లున్నాయి. ఈ తేయాకు తోటల్లో కొందరు దళితులు పని చేసే వాళ్లు. అయితే, వీళ్లు యజమాని దగ్గరి నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కానీ, వాళ్లు వాటిని సమయానికి చెల్లించలేకపోయారు. దీంతో జగదీష గౌడ, అతడి కొడుకు తిలక్ గౌడ కలిసి నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది దళితుల్ని ఒక గదిలో బంధించాడు. దాదాపు 15 రోజులపాటు గదిలోనే ఉంచి, చిత్ర హింసలకు పాల్పడ్డాడు. వారిలో అర్పిత అనే ఒక గర్భిణి కూడా ఉంది. ఆమెపై కూడా దాడి చేస్తూ, తిడుతూ హింసకు పాల్పడ్డాడు. దీంతో ఆమె తన గర్భం కోల్పోయింది. అయితే, ఈమెను ముందుగానే వదిలిపెట్టాడు. వారిలో ఇంకొందరిని తర్వాత వదిలిపెట్టాడు.

Viral Video: నడిరోడ్డుపై బైక్‌కు అంటుకున్న నిప్పు.. ఎంతమంది కలిసి ఆర్పేశారో.. వీడియో వైరల్

మరో పది మంది వరకు బంధీలుగానే ఉంచాడు. బయటకు వచ్చిన వాళ్లంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్లను బంధించి ఉంచిన స్థలానికి చేరుకుని, బంధీలుగా ఉన్న వారిని విడిపించారు. వారిలో కొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితులు బీజేపీ సానుభూతిపరులుగా ఉండటంతో వివాదం ముదిరింది. అయితే, బీజేపీ మాత్రం నిందితులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, వారికి పార్టీలో సభ్యత్వం కానీ, పదవి కానీ లేదని చెప్పింది.