6 నెలులుగా.. 16ఏళ్ల బాలికపై 10మంది గ్యాంగ్‌ రేప్‌

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా, ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 10:15 AM IST
6 నెలులుగా.. 16ఏళ్ల బాలికపై 10మంది గ్యాంగ్‌ రేప్‌

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా, ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా, ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల దళిత బాలికపై 10మంది కామాంధులు 6 నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బెదిరించి లొంగదీసుకున్న నీచరుల.. వేర్వేరు ప్రదేశాలకు తరలిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. 

ఐదుగురు యువకులతో స్నేహం:
మంగళవారం(ఫిబ్రవరి 11,2020) షోలాపూర్‌లోని ఓ గుడి దగ్గర ఏడుస్తున్న బాలికను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. షోలాపూర్‌కు చెందిన బాలిక(16) తల్లితో కలిసి నగరంలో నివాసం ఉంటోంది. కొన్ని రోజుల క్రితమే తండ్రి చనిపోయాడు. జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ తల్లికి సాయం చేసేది. ఈ క్రమంలో ఆమెకు ఐదుగురు యువకులతో స్నేహం ఏర్పడింది. 

6 నెలలుగా అఘాయిత్యం:
6 నెలల క్రితం బాలిక స్నేహితులు ఐదుగురు ఆమె ఇంటికి వచ్చారు. మాయమాటలు చెప్పి నగరంలోని ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడికి మరో ఐదుగురు యువకులు వచ్చారు. మొత్తం 10మంది కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఇలా 6 నెలలుగా అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అనంతరం ఆమెను ఓ గుడి దగ్గర వదిలి వెళ్లారు. ఒంటరిగా ఏడుస్తున్న బాలికను గమనించిన స్థానికులు ఆమె దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఐదుగురి అరెస్ట్:
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నీరసంతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పదిమంది నిందితుల్లో ఐదుగురు బాలిక స్నేహితులే అని పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్‌ చేశామన్నారు. మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఉన్నారని పోలీసులు గుర్తించారు.

చట్టాలు ఓకే.. అమలేది:
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 6 నెలలుగా బాలికపై జరిగిన దారుణం అందరిని ఆవేదనకు గురి చేసింది. ఆ నీచులను వెంటనే ఉరి తీయాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కఠిన చట్టాలు తేవడమే కాదు.. వెంటనే అమలు చేసినప్పుడే ఇలాంటి దారుణాలు ఆగుతాయని చెబుతున్నారు. కోర్టులు, చట్టాలు అంటూ.. కామాంధులను జైల్లో పెంచి పోషిస్తున్నారని మహిళా సంఘాలు మండిపడ్డాయి.