17 Fetuses Found Dumped : హౌరాలో ఘోరం..చెత్తకుప్పలో 17 పిండాలు

పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో అత్యంత దారుమైన..సభ్య సమాజం సిగ్గుపడే దారునం వెలుగు చూసింది. హౌరా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుప్పలో 17 పిండాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది.

17 Fetuses Found Dumped : హౌరాలో ఘోరం..చెత్తకుప్పలో 17 పిండాలు

17 Fetuses Found Dumped : పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో అత్యంత దారుమైన..సభ్య సమాజం సిగ్గుపడే దారునం వెలుగు చూసింది. బెంగాల్ లోని హౌరా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుప్పలో 17 పిండాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఉలుబేరియా మున్సిపాలిటిలో ఉన్న ఓ చెత్తకుప్పలో పిండాలు కలకలం సృష్టించాయి. మంగళవారం (16,2022)చెత్తకుండీలో పిండాలను గుర్తించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. 17 పిండాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో పది ఆడ, మరో ఏడు మగ పిండాలుగా గుర్తించారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఉలుబేరియాలో 30 ప్రవేటు నర్సింగ్‌ హోమ్‌లు ఉన్నాయి. ఈ పిండాలని మెడికల్‌ వేస్టేజ్‌గా పడేశారా? లేదా? బ్రూణహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని..పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు.