కూతురు స్నేహితురాలిని లేపుకు పోయిన రియల్టర్ ?

కూతురు స్నేహితురాలిని లేపుకు పోయిన రియల్టర్ ?

18 years missing girl, not yet traced, Hayathnagar parents worrying : రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివారు,హయత్ నగర్, కుంట్లూరులో గత నెల 18న కనపడకుండా పోయిన ఇంటర్మీడియేట్ చదివే 18 ఏళ్ల బాలిక ఆచూకి ఇంతవరకు తెలియలేదు. దీంతో బాలిక తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ చదివే బాలికను, స్ధానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి పి.యాదయ్య గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకు పోయాడు.

గత10 రోజులుగా బాలిక, యాదయ్యలు కనపడకుండా పోయారు. కాగా ఆ బాలిక తన ఇష్టంతోనే యాదయ్యతో వెళుతున్నట్లు రాసిన లేఖ పోలీసులకు దొరికింది. ఇంటర్ చదివే బాలిక యాదయ్యతో కారులో వెళ్ళటం స్ధానికంగా ఉన్నవారు చూసినట్లు చెపుతున్నారు. తమ కుమార్తె కనపడలేదని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిబ్రవరి 18నే ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు వారిద్దరీ ఆచూకి కనిపెట్టటంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు పోలీసులు వీరీ ఆచూకి కనిపెట్టలేక పోవటంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి.

వాస్తవానికి యాదయ్య తీసుకువెళ్లిన బాలిక అతని కుమార్తెకు స్నేహితురాలని తెలుస్తోంది.  అప్పుడే మైనార్టీ తీరిన బాలికను మాయమాటలతో మోసపుచ్చి, గర్బవతిని చేసి యాదయ్య బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు అనుమానం కలుగుతోంది. ఎందుకంటే బాలిక రాసిందని చెపుతున్న లేఖలో నేను ఇప్పుడు గర్భవతిని అని పేర్కోంది. అంటే యాదయ్య బాలికను మాయమాటలతో లోంగ తీసుకుని గర్భవతిని చేశాడేమో అనే అనుమానం స్పష్టంగా తెలుస్తోంది.

గత కొద్ది ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చిన లాభాలతో హోదా, స్ధాయి పెంచుకుని తన కూతురు వయసున్న బాలికను మాయ మాటలతో యాదయ్య లొంగదీసుకుని ఉండవచ్చు. 10 రోజులుగా తమ కూతురు ఆచూకి కనుక్కోమని బాలిక తల్లితండ్రులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులకు చీమ కుట్టినట్టుకూడ లేదు. బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాలిక తల్లితండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

కాగా….. మైనార్టీ తీరిన బాలిక తన ఇష్టపూర్వకంగానే యాదయ్యతో వెళ్లిపోయినట్లు లేఖ రాసిందని పోలీసులు తప్పించుకో చూస్తున్నారు. కానీ బాలికను కన్నవాళ్ల బాధ వర్ణనాతీతం. బాలికకు, యాదయ్యకు మధ్య వయస్సు తేడా చాలా ఉంది. బాలిక రాసిందని చెపుతున్న లేఖలో “నాకు యాది అంకుల్ అంటే ఇష్టం. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అతను లేకుండా నేను ఉండలేను” అని రాసి ఉంది.

అలాగే ఆ లేఖలో చాలా విషయాలను బాలిక ప్రస్తావించింది. ఐయామ్ సారీ అమ్మ.. దయచేసి తనను అర్థం చేసుకోవాలంటూ తల్లిని కోరింది. ఇక, నిందితుడు యాదయ్య కూడ 10 రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతనికి భార్య ముగ్గురు కూతుళ్లున్నారు. మొత్తంగా ఈ కేసులో చూస్తే యాదయ్యే మైనార్టీ తీరిన బాలికను మోసం చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అతనికున్న పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేస్తున్నాడేమో అనే ధర్మసందేహం కలుగుతోంది. ఎందుకంటే పెద్ద పెద్ద కిడ్నాప్ కేసులు, మర్డర్ కేసులు, దొంగతనాల కేసులను 24 గంట్లలో చేధించిన పోలీసులు మిస్సింగ్ కేసులో ఇద్దర్ని పట్టుకోలేకపోవటం ఈ సందేహాలకు బలమిస్తోంది. ఏది ఏమైనా యాదయ్య, కానీ బాలిక కానీ దొరికితేనే ఏమైందనే విషయం తెలియదు.