Sexually Assaulting : మైనరు బాలుడ్ని పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన 19 ఏళ్ల యువతి

తమిళనాడులోని పొలాచ్చిలో ఒక యువతి మైనర్ బాలుడితో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టిన ఘటన వెలుగు చూసింది.

Sexually Assaulting : మైనరు బాలుడ్ని పెళ్లి చేసుకుని కాపురం పెట్టిన 19 ఏళ్ల యువతి

sexually assaulting minor

Sexually Assaulting : మనకు తెలిసినంతలో మైనర్ బాలికను రేప్ చేయటం, మోసం చేసి పెళ్లి చేసుకోవటం వంటి ఘటనలు సాధారణంగా చూస్తూ ఉంటాము. కానీ తమిళనాడులోని  పొలాచ్చిలో ఒక యువతి మైనర్ బాలుడితో ప్రేమాయణం నడిపి, పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టిన ఘటన వెలుగు చూసింది.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి లోని పెట్రోల్ బంక్ లో ఓ యువతి(19) పని చేస్తోంది. అదే ప్రాంతంలో 12వ తరగతి చదివే ఓవిద్యార్ధి(17) రోజు ఆ పెట్రోల్ బంక్ కు వచ్చి పెట్రోల్ పోయించుకుని వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆయువతికి విద్యార్ధికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దాదాపు ఏడాది పాటు వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని  తిరిగారు.

కొన్నాళ్లకు ఈవిషయం విద్యార్ధి ఇంట్లో తెలిసి అతడి తల్లితండ్రులు యువతి వద్దకు వచ్చి తమ పిల్లవాడితో స్నేహం,  ప్రేమ మానుకోమని హెచ్చరించారు. అయినా యువతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొద్ది రోజుల క్రితం ఆ విద్యార్ధి అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో యువతి ఆస్పత్రికి వచ్చి అతనికి సపర్యలు చేసింది.

విద్యార్ధి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయి వెళ్లాడు.  ఇదే క్రమంలో కొన్నిరోజుల క్రితం ఆయువకుడిని తీసుకుని పళని సుబ్రహ్మణ్యస్వామి గుడికి తీసుకవెళ్లింది. మనల్ని ఎవరూ విడదీయకుండా ఉండాలంటే నువ్వు నన్నుపెళ్లి చేసుకోమని చెప్పి… అక్కడి విద్యార్ధితో తాళి కట్టించుకుంది. అనంతరం ఇద్దరూ కోయంబత్తూరు వెళ్లి అక్కడ ఇల్లు అద్దెకు  తీసుకుని జీవించసాగారు.

ఈ సమయంలో తమ కుమారుడు కనిపించటంలేదని విద్యార్ధి తల్లి తండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు కోయంబత్తూరులో వీరిని పట్టుకుని పొల్లాచ్చి తీసుకు  వచ్చారు. పోలీసులు తమదైన స్టైల్లో గట్టిగా మందలించటంతో విద్యార్ధి …తనను యువతి బలవంతంగా తీసుకువెళ్లి తాళి కట్టించుకుందని తెలిపాడు.

కోయంబత్తూరులో తామిద్దరం సన్నిహితంగా గడిపినట్లు పోలీసులకు వివరించాడు. పోలీసులు యువతిపై పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టుకు హజరు పరిచారు. కోర్టు యువతికి  రిమాండ్ విధించింది.  కాగా… పోక్సో  కేసులో యువతిపై కేసు నమోదవ్వటం.. విద్యార్ధిని నమ్మించి పెళ్లి చేసుకున్న ఘటనలో యువతి అరెస్ట్ కావటం ఇదే మొదటి సారని ఎస్పీ సెల్వనాగరత్నం తెలిపారు.