Delhi: భివండిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్.. ఢిల్లీలో ఇద్దరి హత్య.. తప్పించుకున్న మరో చిన్నారి

చిన్నారుల్ని బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇకపోతే, నిందితులు బిహార్‭కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారు భివండిలోని బాధితుల ఇంటికి సమీపంలోనే నివసించేవారు. ప్రాథమిక దర్యాప్తులో వారు డ్రగ్స్‭కు బాగా అలవాటు పడ్డట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబ్బు కోసం చిన్నారుల్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

Delhi: భివండిలో ముగ్గురు చిన్నారుల కిడ్నాప్.. ఢిల్లీలో ఇద్దరి హత్య.. తప్పించుకున్న మరో చిన్నారి

2 Kidnapped Rajasthan Brothers Killed In Delhi

Delhi: దేశ రాజధాని ఢిల్లీలోని మెరౌలి ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాల్ని పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ రాజస్తాన్‭కు చెందిన వారని, కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన ముగ్గురిలో ఇద్దరని వారు నిర్ధారించారు. అయితే మరొక చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ముగ్గురి చంపేసినట్టు దుండగులు భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ప్రాణాలతో ఉన్న మూడో చిన్నారి, సదరు అడవి నుంచి బయటికి వచ్చి పోలీసులకు కనిపించాడు.

రాజస్తాన్ రాష్ట్రంలోని భివండి ప్రాంతంలో అక్టోబర్ 15వ తేదీని ఒకే కుటుంబానికి చెందిన అమన్(13), విపిన్(8), శివ(6) అనే అన్నదమ్ములను కొంత మంది దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారి తండ్రి గుసన్ సింగ్ నుంచి భారీ స్థాయిలో డబ్బు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో చిన్నారుల్ని ఢిల్లీలో హతమార్చి పూడ్చేసినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

ఈ విషయమై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన రాజస్తాన్, ఢిల్లీ పోలీసులు.. ట్రాకింగ్ ద్వారా ఎట్టకేలకు చిన్నారులను హతమార్చిన ప్రదేశాన్ని కనుగొన్నారు. అది ఢిల్లీలోని మెరౌలి అటవీ ప్రాంతంలో ఉంది. ఇక ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అయితే ఘటనా స్థలంలో ఇద్దరు మృతదేహాలు మాత్రమే లభించే సరికి.. మూడో చిన్నారి కోసం వెతికారు. చావు నుంచి బయటపడి ప్రాణ భయంతో అడవిలోనే దాక్కున శివను గుర్తించి, చిల్డ్రన్ రీహాబిలిటేషన్‭కు తరలించారు.

చిన్నారుల్ని బలమైన ఆయుధాలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఇకపోతే, నిందితులు బిహార్‭కు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారు భివండిలోని బాధితుల ఇంటికి సమీపంలోనే నివసించేవారు. ప్రాథమిక దర్యాప్తులో వారు డ్రగ్స్‭కు బాగా అలవాటు పడ్డట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డబ్బు కోసం చిన్నారుల్ని కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

Viral Video: ఇద్దరి మధ్య గొడవ.. ప్రయాణిస్తున్న రైలు నుంచి ఒక వ్యక్తిని తోసేసిన మరొక వ్యక్తి