Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి

Uttarakhand

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. మధ్య ప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుంచి 40 మంది భక్తులతో కూడిన బస్సు యమునోత్రి వెళ్తుండగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్ర రెస్క్యూ టీమ్‌తోపాటు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Virata Parvam: విరాటపర్వం ట్రైలర్ లాంఛ్ వేదిక వద్ద ప్రమాదం.. తప్పిన ముప్పు

ఈ ఘటనపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ మృతుల కుటుంబలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి యాభై వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు.