తీవ్ర విషాదం : ప్రేమోన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత మృతి

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత కన్నుమూసింది. వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన లెక్చరర్.. చివరికి తుదిశ్వాస విడిచింది.

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 11:03 AM IST
తీవ్ర విషాదం : ప్రేమోన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత మృతి

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత కన్నుమూసింది. వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన లెక్చరర్.. చివరికి తుదిశ్వాస విడిచింది.

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత(25) కన్నుమూసింది. వారం రోజులు ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడిన లెక్చరర్.. చివరికి తుదిశ్వాస విడిచింది. సోమవారం(ఫిబ్రవరి 10,2020) అంకిత(ankita pisudde) మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. అంకిత మృతితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు వికేష్ ను(27) (vikesh nagrale) కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. అంకిత మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ పై రాళ్ల దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా దాడి చేశారు.

అంకిత మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంకితకు జరిగిన అన్యాయంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. నిందితుడిని ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తూ.. అంబులెన్స్ పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో అంబులెన్స్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల దాడితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మహారాష్ట్రలోని వార్ధా (wardha) జిల్లా హింగన్‌ఘాట్‌లో(hinganghat) అంకిత లెక్చరర్‌గా పని చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన వికేష్ నగ్రలె అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించే వాడు. వాస్తవానికి వికేష్ కు పెళ్లైంది. అతనికి 7 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా.. అంకితను వేధించడం మాన లేదు. అదే సమయంలో అంకితకు పెళ్లి కుదరింది. దీంతో అంకితపై వికేష్ కక్ష పెంచుకున్నాడు. ఫిబ్రవరి 3న కాలేజీ వెళ్తున్న అంకితను వికేష్ అడ్డగించాడు. కాలేజీ ముందే గొడవపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ ను ఆమెపై చల్లి, నిప్పంటించాడు.

vikesh

ఈ ఘటనలో అంకితకు 40 నుంచి 50 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వార్ధా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని ఆరెంజ్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అంకిత చనిపోయింది. కాలిన గాయాలు తిరగబెట్టడంతో శరీరం మొత్తం సెప్టిక్‌కు గురైందని డాక్టర్లు తెలిపారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే స్పందించారు. అంకిత కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.