Gujarat : బాలికను పొడిచి చంపిన యువకుడికి మరణశిక్ష విధించిన కోర్టు

రెండు సంవత్సరాల క్రితం ఓ బాలికను అత్యంత పాశవికంగా పొడిచి చంపిన యువకుడికి గుజరాత్ కోర్టు మరణిశిక్ష విధించింది. రాజ్ కోట్ లో జరిగిన ఈ దారణానికి సంబంధించిన కేసును అరుదైన కేసుగా భావించిన న్యాయమూర్తి సదరు యువకుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Gujarat : బాలికను పొడిచి చంపిన యువకుడికి మరణశిక్ష విధించిన కోర్టు

Gujarat Girl murder case

Gujarat : రెండు సంవత్సరాల క్రితం ఓ బాలికను అత్యంత పాశవికంగా పొడిచి చంపిన యువకుడికి గుజరాత్ కోర్టు మరణిశిక్ష విధించింది. రాజ్ కోట్ లో జరిగిన ఈ దారణానికి సంబంధించిన కేసును అరుదైన కేసుగా భావించిన న్యాయమూర్తి సదరు యువకుడికి సోమవారం (మార్చి 13,2023) మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ యువకుడు ఇంటర్ చదివే అమ్మాయి వెంట పడి ప్రేమించానంటూ వెంటపడ్డాడు. వేధించాడు. నాకు ఇష్టంలేదంటూ చెప్పినా వినలేదు. ఆఖరికి వెంటాడి వేధించి నా ప్రేమను నిరాకరించిన నువ్వు బతకటానికి వీల్లేదంటూ ఆమెపై కత్తితో దాడి చేసిన 34సార్లు పొడిచి పొడిచి చంపాడు.ఆ తరువాత జైలుపాలయ్యాడు. అన్ని సాక్షాధారాలు కోర్టుకు సమర్పించటంతో దోషిగా తేలిన సదరు యువకుడికి మరణశిక్ష విధించింది గుజరాత్ లోని కోర్టు.

రాజ్ కోట్ లో 2021 మార్చిలో ఇంటర్ చదివే ఓ అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నానంటూ వేధించాడు జయేష్ సార్వయా అనే 26 ఏళ్ల యువకుడు. కానీ ఆమె మాత్రం నాకు ఇష్టంలేదని తేల్చి చెప్పింది. కానీ వినలేదు. వెంటాడి వేధించేవాడు. ఆఖరికి ఓరోజున జెట్ పూర్ లోని జెతల్ సర్ గ్రామంలో నివసించే ఆమె ఇంటికెళ్లాడు. నన్ను ప్రేమిస్తావా లేదా? అని బెదిరించాడు. ఆమె అప్పుడు కూడా నిరాకరించింది. దీంతో కొట్టాడు. దీంతో ఆ బాలిక పారిపోవటానికి యత్నించింది. వెంటాడి పట్టుకుని కూడాపట్టుకెళ్లిన కత్తితో 34సార్లు పొడిచి పొడిచి చంపేశాడు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. 34సార్లు అత్యంత దారుణంగా పొడవటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

దీంతో కుటుంబ సభ్యులు జయేష్ సార్వయాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు. కోర్టు నిందితుడికి దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. అడిషనల్ డిస్ట్రిక్ట్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది.

నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారని పబ్లిక్ ప్రాజిక్యూటర్ జనక్ పటేల్ అన్నారు. సదరు దోషికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మరణశిక్ష విధించింది. ఈ శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు.