Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి

తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.

Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు మృతి

Encounter: జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామాలోని ద్రబ్గాం ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తీవ్రవాదులను లష్కరే తొయిబా సంస్థకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.

Prayagraj Clash: ప్రయాగ్‌రాజ్ హింస.. నిందితుడి ఇంటి కూల్చివేతకు సిద్దం

దీంతో సైన్యం కూడా ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. వీరిని ఫజిల్ నజైర్ భట్, ఇర్ఫాన్ అహ్మద్ మాలిక్, జునైద్ షీర్‌గోర్జిగా గుర్తించారు. మరణించిన తీవ్రవాదుల్లో ఒకరిని, గత నెలలో పోలీసును కాల్చి చంపిన నిందితుడిగా తేల్చారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 గన్‌లు, పిస్టోల్, ఇతర ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.