Baby Poked With Hot Rod : దారుణం.. వ్యాధి తగ్గిస్తామని 3నెలల పసికందుకి 51సార్లు వాతలు పెట్టిన మంత్రగాళ్లు

సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతుండటం బాధాకరం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.. ఇంకా కొందరు గుడ్డిగా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

Baby Poked With Hot Rod : దారుణం.. వ్యాధి తగ్గిస్తామని 3నెలల పసికందుకి 51సార్లు వాతలు పెట్టిన మంత్రగాళ్లు

Baby Poked With Hot Rod : ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులు ఇవి. స్పేస్ టూరిజం దిశగా అడుగులు పడుతున్నాయి. మనిషి ఎంతో డెవలప్ అయ్యాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అలాంటి ఈ రోజుల్లోనూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతుండటం బాధాకరం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలిసినా.. ఇంకా కొందరు గుడ్డిగా మంత్రగాళ్లను నమ్ముతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లిదండ్రుల మూఢ నమ్మకాలకు ఓ పసికందు బలైంది. వ్యాధి తగ్గుతుందని 3 నెలల చిన్నారికి 51 సార్లు పొట్ట భాగంలో వాతలు పెట్టారు. దీంతో ఇన్ఫెక్షన్ ఎక్కువై చిన్నారి కన్నుమూసింది.

Also Read..Aadhaar Finger Prints : బీ కేర్ ఫుల్.. ఆధార్ ఫింగర్ ప్రింట్స్‪తో ఘరానా మోసం, సైబర్ క్రిమినల్ అరెస్ట్

అది షాదోల్‌ జిల్లాలోని సింగ్‌పుర్‌ కథౌటియా గ్రామం. అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వారిలో మూఢ నమ్మకాలు ఎక్కువ. ఈ ప్రాంతానికి చెందిన మూడు నెలల చిన్నారి న్యూమోనియా బారినపడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయితే, చికిత్స కోసం తల్లిదండ్రులు డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ల లేదు. స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు.

వ్యాధి తగ్గిస్తామని చెప్పి మంత్రగాళ్లు అమానుషానికి పాల్పడ్డారు. పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప కడ్డీతో ఏకంగా 51 సార్లు వాతలు పెట్టారు. దీంతో చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించింది. తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు పసికందును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. న్యూమోనియాకు సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువైంది.

Also Read..Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

15 రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడిన చిన్నారి మృతి చెందింది. ‘శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లగా.. 15 రోజుల కిందట జరిగిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ రోజుల్లోనూ ప్రజల్లో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. వారిలో చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే, మంత్రాల పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.