Obscene Video of Girl : దారుణం.. బాత్‌రూమ్‌లో ఉండగా విద్యార్థిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఫ్రెండ్స్

ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్రూమ్‌లో 19ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో చిత్రీకరించి, ఆ క్లిప్‌ను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు.

Obscene Video of Girl : దారుణం.. బాత్‌రూమ్‌లో ఉండగా విద్యార్థిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఫ్రెండ్స్

Obscene Video of Girl : ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. వెంటే ఉంటూ, స్నేహంగా ఉండే ఫ్రెండ్స్ కూడా నమ్మకద్రోహం చేస్తున్నారు. దారుణాలకు తెగబడుతున్నారు. సహచర విద్యార్థులు ఓ విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఆమె బాత్ రూమ్ లో ఉండగా వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు దిగారు.

తమతో చదువుకునే ఓ స్నేహితురాలిని సహచర విద్యార్థులు ముగ్గరు కలిసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. భోపాల్‌ నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్రూమ్‌లో 19ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో చిత్రీకరించి, ఆ క్లిప్‌ను సర్క్యులేట్ చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. కాగా, వీడియో తీసి విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుదామనుకున్న యువకుల ప్లాన్ బెడిసికొట్టింది. వారు కటకటాల పాలయ్యారు.

నిందితులు, బాధితురాలు నగరంలోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో చదువుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్‌రూమ్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ముగ్గురు కలిసి వీడియో తీశారు. అనంతరం ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు. రూ.7వేలు డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో తీసిన యువకుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఫ్రెండ్సే ఇలా చేయడం సహచర విద్యార్థులను, కాలేజీ సిబ్బందిని, విద్యార్థుల తల్లిదండ్రులను షాక్ కి గురి చేసింది.