మావోయిస్టుల దుశ్చర్య : బస్సులు, టిప్పర్ల దహనం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దోర్నాపాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 03:24 PM IST
మావోయిస్టుల దుశ్చర్య : బస్సులు, టిప్పర్ల దహనం

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దోర్నాపాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఛత్తీస్ గఢ్ : ఒకవైపు కొంతమంది మావోయిస్టులు లొంగిపోతుంటే.. మరోవైపు మరికొంతమంది మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు దాడులకు పాల్పడుతున్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దోర్నాపాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వాహనాలపై 30 మంది మావోయిస్టులు కాల్పులు జరిపారు. బస్సులు, టిప్పర్లను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, అతని భార్య లొంగిపోయారు. ఇద్దరూ రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లొంగిపోతున్నట్లు పేర్కొన్నారు. వారిని ఫిబ్రవరి 13 వ తేదీన తెలంగాణ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.