Gold Smuggling : బంగారం స్మగ్లింగ్‌లో కొత్త మార్గాలు

బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.

Gold Smuggling : బంగారం స్మగ్లింగ్‌లో కొత్త మార్గాలు

Gold Smuggling

Gold Smuggling : బంగారం ధర గత కొన్నేళ్లుగా పైపైకి పెరుగుతూ పోతూనే ఉంది. బంగారంలో పెట్టుబడులు పెట్టినవారికి లాభాలు తెచ్చిపెడుతూనే ఉంది. దానితోపాటు బంగారం స్మగ్లింగ్ కూడా పెరిగిపోయింది. విదేశాలనుంచి అక్రమంగా బంగారం తీసుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్రమ బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. వీళ్ల ఐడియాలు చూస్తూంటే ఇలాకూడా స్మగ్లింగ్ చేయవచ్చా అని అనిపిస్తుంటుంది.

కేరళలోని కన్నూరు విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఒక వ్యక్తి విమానం  దిగి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని నడకలో తేడా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని తనిఖీ చేశారు. 302 గ్రాముల బంగారాన్ని పేస్టుగా మార్చి, దాన్ని ఒక  క్లాత్ పై పెయింట్ లాగా వేసి దానిని లోపల వైపు ఉంచి  …. వేరోక  క్లాత్ తో కలిపి రెండు పొరలతో   ప్యాంట్ కుట్టించుకుని దాని ద్వారా బంగారాన్ని తీసుకు వస్తున్నాడు.  ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు.