విమాన ప్రయాణంలో..నాలుగు నెలల చిన్నారి మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : November 16, 2019 / 07:11 AM IST
విమాన ప్రయాణంలో..నాలుగు నెలల చిన్నారి మృతి

విమానంలో ప్రయాణిస్తూ నాలుగు నెలల పసిపాప మరణించిన విషాద ఘటన ముంబైలో వెలుగుచూసింది. సూరత్ కి చెందిన ప్రీతి జిందాల్ తన నాలుగునెలల వయసున్నకూతురు, అత్తమామలతో కలిసి సూరత్ నుంచి ముంబై నగరానికి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరింది. సూరత్ ఎయిర్ పోర్ట్ విమానం ఎక్కే ముందు ప్రీతిజిందాల్ తన చిన్నారి కూతురు రియాకు పాలు తాగించింది. అనంతరం పసిపాప నిద్రపోవడంతో వారు విమానం ఎక్కారు.

స్పైస్ జెట్ విమానం ముంబైలో దిగాక చూస్తే పాపను చూస్తే ఆమెలో చలనం లేదు. దీంతో ప్రీతిజిందాల్ విమాన సిబ్బందికి తెలియజేయడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించి వెంటనే వైద్యసహాయం కోసం ఏర్పాట్లు చేయమని కోరారు. వెంటనే పసిపాపను ముంబైలోని నానావతి హాస్పిటల్ కు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే పాపచనిపోయిందని ప్రకటించారు. విమాన ప్రయాణంలో పసిపాప మృతి ఘటనతో తల్లి ప్రీతిజిందాల్ తోపాటు ఆమె అత్తమామలు కన్నీరుమున్నీరుగా రోదించారు.

చిన్నారి మృతదేహాన్ని డాక్టర్ ఆర్ఎన్ కోపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించినా మృతికి కారణం తెలియలేదు. దీంతో పాప మృతదేహానికి రీ పోస్టు మార్టం జరిపించడం కోసం కూపర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని స్పైస్ జెట్ అధికారులు తెలిపారు.