పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

  • Edited By: chvmurthy , April 24, 2019 / 04:02 PM IST
పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొని వారినుంచి  ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. పాతబస్తీలో చీరల వ్యాపారం చేసే ఫజల్ వారం రోజుల కిందట తన కొడుకు కనిపించడం లేదంటూ  ఫిర్యాదు  చేశాడు.  దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీంపోలీసులు సి సి ఫుటేజ్ ఆధారంగా నలుగురు మహిళలను అదుపులోకి తీసుకొన్నారు.

ఇంటి ముందు ఒంటరిగా ఆటలాడుకుంటున్న చిన్నారులను టార్గెట్ చేసే ఈ ముఠా  సభ్యులు పిల్లలను కిడ్నాప్ చేసి, పిల్లలు లేని వారికి 10 వేల నుండి 30 వేల రూపాయల వరకు విక్రయిస్తుంటారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు దొరికిన ముగ్గురు చిన్నారులు కాకుండా,  ఈ ముఠా అదుపులో ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.