చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్ చేసిన డాక్టర్, ఐటీ అధికారులతో సహా 41 మంది అరెస్ట్

చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్ చేసిన డాక్టర్, ఐటీ అధికారులతో సహా 41 మంది అరెస్ట్

41 people arrest as part of under Operation P-hunt in kerala : దేశంలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై చైల్డ్ పోర్న్ చూసినా వ్యాప్తి చేసినా అటువంటి వారిపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. నిషేధిత చైల్డ్ పోర్న్ వీడియోల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసిన వారి ఐపీ అడ్రస్ ల ఆధారంగా వారిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపిస్తున్నారు. ఈవిషయం లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది.

కేంద్రం ఈ చట్టాని తీసుకు వచ్చినప్పటినుంచి  రాష్ట్రంలో ఆపరేషన్-పి హంట్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం డిసెంబర్ 27న రాష్ట్రంలోని 465 స్ధలాలలో ఒకేసారి దాడులు నిర్వహించారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోలను వివిధ సైట్లలో చూసినా, ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినా, సోషల్ మీడియా ప్లాట్ ఫారంలపై షేర్ చేసిన వారిని..వారి ఐపీ అడ్రస్ ల ఆధారంగా గత కొంతకాలంగా గుర్తించారు.

అటువంటి 465మందిపై ఏక కాలంలో దాడులు చేసి వారిపై 399 కేసులు నమోదు చేశారు. అందులో 41 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో డాక్టర్, పలువురు ఆదాయపన్ను శాఖ అధికారులు, విద్యావంతులు ఉన్నారని ఆపరేషన్ నిర్వహించిన ఏడీజీపీ మనోజ్ అబ్రహం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 సార్లు ఆపరేషన్-పి హంట్ నిర్వహించినట్లు ఆయన వివరించారు.