Fake Bank in Tamil Nadu : తమిళనాడులో ‘ఉత్తుత్తి’ బ్యాంక్ .. ఎనిమిది బ్రాంచీల్లో డిపాజిట్ల పేరుతో భారీ దోపిడీ..

తమిళనాడులోని చెన్నైలో ఓ వ్యక్తి ‘ఉత్తుత్తి’ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. దానితో పాటు మరో ఎనిమిది బ్రాంచీలు కూడా ఓపెన్ చేసిన జనాల నుంచి డిపాజిట్లు సేకరించి కోట్లాదిరూపాయలు దోచేశాడు. గుట్టు బయపటడటంతో అరెస్ట్ అయ్యాడు.

Fake Bank in Tamil Nadu : తమిళనాడులో ‘ఉత్తుత్తి’ బ్యాంక్ .. ఎనిమిది బ్రాంచీల్లో డిపాజిట్ల పేరుతో భారీ దోపిడీ..

Fake Bank in Tamil Nadu

Fake Bank in Tamil Nadu : నకిలీ నోట్ల తయారు చేయటం, మార్చటం వంటివి సర్వసాధారణమైపోయాయి ఏదన్నాకొత్త గా చేద్దామనుకున్నాడో ఏమోగానీ విదేశాల్లో చదువుకుని ఏకంగా ఓ బ్యాంక్ పెట్టేశాడు 42 ఏళ్ల వ్యక్తి. లండన్ లో చేసిన ఎంబీయే చదివిన వ్యక్తి ఏకంగా ఏ బ్యాంకే పెట్టేశాడు. అంతేకాదు ఆ బ్యాంకుకు మరో ఎనిమిది బ్రాంచీలు కూడా స్థాపించాడు. ఇంకేముంది డిపాజిట్ల పేరుతో భారీగా దోచేశాడు. అలా ఏడాదికిపైగా సాగింది ఈ బ్యాంకింగ్ దందా. చివరకు ఆర్బీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బోగస్ బ్యాంకుని..దానికి సంబంధించిన బ్రాంచీలను మూసివేశారు.

తమిళనాడుకు చెందిన చంద్రబోస్ అనే యువకుడు చెన్నైలో ఓ బ్యాంకును తెరిచాడు. ఆబ్యాంకుకి ‘గ్రామీణ రైతుల సహకార బ్యాంకు’ అని పేరు పెట్టాడు. లండన్ లో చేసిన ఎంబీయే డిగ్రీ, గత ఉద్యోగ అనుభవంతో పకడ్బందీగా బ్యాంకును ఏర్పాటు చేశాడు. అందరు నమ్మేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమ బ్యాంకుకు గుర్తింపు ఉందని నిరూపించుకోవటానికి ఓ నకిలీ సర్టిఫికెట్ తయారు చేసుకున్నాడు. మరి ఇన్ని బ్రాంచీలున్న బ్యాంకుకు ఉద్యోగులు కావాలి కదా. గ్రామీణ రైతుల సహకార బ్యాంకులో ఉద్యోగం కావాలంటే కూడా ఖర్చు అవుతుందన్నాడు. బ్యాంక్ ఉద్యోగం కదాని డబ్బులు సమర్పించుకుని ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు కొంతమంది. ఉద్యోగం ఇవ్వడానికి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా వసూలు చేశాడు.మొత్తంగా 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కుల పేరుతో నియమించుకున్నాడు.

మరి బ్యాంక్ అంటే విత్ డ్రా స్లిప్పులు..స్టాంపులు వంటి తతంగాలుంటాయి కదా.. ఓ ‘ఉత్తుత్తి’బ్యాంకునే క్రియేట్ చేసినవాడికి ఇవన్నీ ఓ లెక్కా ఏంటీ..అలా మిగతా బ్యాంకుల తరహాలోనే డిపాజిట్, విత్ డ్రా స్లిప్పులు, స్టాంపుల్ని క్రియేట్ చేశాడు. అలాగే తగినంత సిబ్బందిని నియమించుకుని బ్యాంక్ ను నడిపించాడు.

చెన్నైలో బ్యాంక్ సక్సెస్ కావటంతో రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాల్లో బ్రాంచీలు ఓపెన్ చేశాడు. అలా మొత్తంగా 46 మందిని మేనేజర్లు, క్యాషియర్లు, క్లర్కులను నియమించుకున్నాడు. కొత్త ఖాతాలను తెరవడంతో పాటు, డిపాజిట్ల పేరుతో రూ. 2 కోట్ల వరకు ప్రజల నుంచి వసూలు చేశాడు. తమిళనాడులో నడుస్తున్న ఈ బ్యాంకు వ్యవహారం రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వెళ్లింది. దీంతో ఈ బ్యాంకుకు గుర్తింపు లేదని, ఫోర్జరీ సర్టిఫికెట్ తో బ్యాంకును తెరిచారని పోలీసులకు ఆర్బీఐ తెలిపింది.

ఆర్బీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చైన్నై, మధురై, సాలెం, ఈరోడ్, నమక్కల్, కల్లాకురిచి, పెరంబలూర్, వృద్దాచలం, తిరువన్నామళైలలోని బ్యాంకు బ్రాంచీలపై దాడులు చేశారు. ఉద్యోగులతో పాటు బ్యాంకును ఏర్పాటు చేసిన బ్యాంకుల క్రియేటర్ చంద్రబోస్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైనశైలిలో విచారించారు. దీంతో అతగాడు చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్ అయ్యారు. వీడి తెలివితేటలు పాడుగాను అనుకున్నాడు. తన బ్యాంకులో డిపాజిట్లు చేసిన నగదును ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేసానని తెలిపాడు. దీంతో అధికారులు అతని ఖాతాను సీజ్ చేశారు. ప్రస్తుతం అందులో రూ. 56 లక్షలు ఉంది. మిగతా సొమ్ము ఏం చేశాడు? ఎంత మంది వద్ద డిపాజిట్లు సేకరించాడు? ఆ డబ్బుని ఎక్కడ దాచాడు? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. చెన్నై బ్యాంకుతో పాటు దానికి సంబంధించిన అన్ని బ్రాంచీలను మూసేవేశామని చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు.