Andhra Pradesh : కుప్పంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.

Andhra Pradesh : యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
ఆరేళ్ల చిన్నారిపై 48 ఏళ్ల శ్రీధర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావటంతో ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని గుర్తించిన స్ధానికులు అతడ్ని చితకబాదారు. ఈలోగా ఘటనా స్ధలానికి చేరుకున్నపోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు.