Delhi Murder Case: శ్రద్ధను ముక్కలు చేయడానికి అఫ్తాబ్ వాడిన 5 కత్తులు స్వాధీనం

ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ అనే అమ్మాయిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటనలో రోజుకో విషయం బయటపడుతోంది. శ్రద్ధను అఫ్తాబ్ ముక్కలుగా కోసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇవాళ ఐదు కత్తులను గుర్తించారు. ఆ కత్తులతోనే శద్ధను అఫ్తాబ్ ముక్కలు ముక్కలుగా కోశాడని చెప్పారు. అఫ్తాబ్ వాడిన మరో రంపం ఇప్పటికీ లభ్యం కాలేదని అన్నారు.

Delhi Murder Case: శ్రద్ధను ముక్కలు చేయడానికి అఫ్తాబ్ వాడిన 5 కత్తులు స్వాధీనం

Delhi Murder Case: ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ అనే అమ్మాయిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన ఘటనలో రోజుకో విషయం బయటపడుతోంది. శ్రద్ధను అఫ్తాబ్ ముక్కలుగా కోసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు ఇవాళ ఐదు కత్తులను గుర్తించారు. ఆ కత్తులతోనే శద్ధను అఫ్తాబ్ ముక్కలు ముక్కలుగా కోశాడని చెప్పారు.

అఫ్తాబ్ వాడిన మరో రంపం ఇప్పటికీ లభ్యం కాలేదని అన్నారు. తాము ఐదు కత్తులను స్వాధీనం చేసుకున్నామని, అవి ఒక్కోటీ 5-6 అంగుళాల చొప్పున ఉన్నాయని వివరించారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపామని చెప్పారు. శ్రద్ధావాకర్‌ ను అఫ్తాబ్ హత్య చేసిన ఘటనలో ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలు సంపాదించారు.

వారిద్దరి సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించారు. డేటింగ్ యాప్ ద్వారా శ్రద్ధావాకర్‌, అఫ్తాబ్ పరిచయమై, చాటింగ్ చేసుకున్నారు. 2019 నుంచి వారిద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే, 2020 నుంచే శ్రద్ధను అఫ్తాబ్ వేధించడం మొదలు పెట్టాడని, తీవ్రంగా కాట్టేవాడని వాట్సాప్ లో తన మేనేజర్ కరణ్ తో శద్ధ చేసిన చాటింగ్ ద్వారా వెల్లడైంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..