విమానం టాయిలెట్‌లో 5.6 కిలోల బంగారం

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 12:58 AM IST
విమానం టాయిలెట్‌లో 5.6 కిలోల బంగారం

బంగారాన్ని అక్రమ మార్గంలో తరలించడానికి స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కాలి బూట్లలో, విగ్గుల్లో..ఇల రకరకాల మార్గాల్లో గోల్డ్‌ను తరలించాలని ప్లాన్స్ వేస్తుంటారు. కానీ వీరి ప్లాన్స్‌కు కస్టమ్స్ అధికారులు చెక్ పెడుతుంటారు. తాజాగా విమానంలోని టాయిలెట్‌లో 5.6 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. 

దుబాయ్ నుంచి చెన్నై నగరానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ (AI – 906) వస్తోంది. ఉదయం 5 గంటలకు దిగింది. అనంతరం AI 440గా మార్చి..ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఇందులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం కస్టమ్స్ అధికారులకు వచ్చింది. ఢిల్లీకి విమానం చేరుకున్న తర్వాత..అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. విమానంలోని టాయిలెట్‌లో టేపుతో చుట్టిన ఓ వస్తువు కనిపించింది. దీని తెరిచి చూశారు.

నాలుగు బండిళ్లు కనిపించాయి. అందులో బిస్కెట్ల మాదిరిగా 48 బంగారం ఉంది. వెంటనే స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5.6 కిలోల బరువు ఉందని నిర్ధారించారు. దీనిని ఎవరు తరలిస్తున్నారనే దానిపై విచారణ చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. గత నెలలో 6 కిలోల గోల్డ్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సిలిగురి, హౌరాలో జరిగిన ఓ ఆపరేషన్‌లో బంగారాన్ని స్వాధీనం చేసుకుని..నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 
Read More : 20% క్యాష్ బ్యాక్ : అమెజాన్‌లో Movie Tickets బుకింగ్ చేయండిలా