షెల్టర్ హోమ్‌లో 57మంది మైనర్ అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు ప్రెగ్నెంట్, ఒకరికి HIV

  • Published By: madhu ,Published On : June 22, 2020 / 02:26 AM IST
షెల్టర్ హోమ్‌లో 57మంది మైనర్ అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు ప్రెగ్నెంట్, ఒకరికి HIV

దారుణమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాన్పూర్ ఆశ్రయ గృహంలో 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ తేలింది. వారిలో 5 మంది ప్రెగ్నెంట్ ఉన్నారని తేలడం కలకలం రేపుతోంది. ఇందులో ఒకరికి HIV సోకింది. ఇదొక ముజఫర్ అని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ విషయం తెలిసిన అధికారులు ఆశ్రయానికి తాళం వేసి సీజ్ చేశారు. దీనిపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్రహ్మ డియో రామ్ తివారీ మాట్లాడుతూ…వివిధ జిల్లాలోని శిశు సంక్షేమ కమిటీల సిఫార్సు మేరకు..బాలికలను ఆశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. అప్పటికే కొంతమంది గర్భవతులుగా ఉన్నారని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

వీరందరూ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు, 2019 డిసెంబర్ ఇద్దరు బాలికలు ఆగ్రా నుంచి వచ్చారని కాన్పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ దినేష్ కుమార్ తెలిపారు. అయితే..చాలా మంది ఆశ్రయంలో ఉన్న వారు గర్భవతులుగా ఉన్నారని వదంతులు వ్యాపించాయి. ఇది నిజం కాదని కొట్టిపారేశారు దినేష్ కుమార్.

ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతోందని, రెండు నెలల్లో ఎవరు వచ్చారు ? ఎక్కడకు వెళ్లారు ? వీరికి కరోనా వైరస్ ఎలా సోకిందనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. నివాసంలోకి మగవారిని అనుమతించమని, కానీ అప్పటికే బాలికలు గర్భవతులయ్యారని యూపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ పూనమ్ కపూర్ తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. 

 

Read:కిల్లర్‌ Cyanide మోహన్‌కు 20వ హత్యకేసులోనూ దోషే.. 24వ తేదీ తీర్పులో ఉరిశిక్ష?