United States: వాషింగ్ మిష‌న్‌లో విగ‌త‌జీవిగా కనపడ్డ ఏడేళ్ళ బాలుడు

ఓ బాలుడు వాషింగ్ మిష‌న్‌లో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కుండా పోయాడ‌ని అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చిన మూడు గంట‌ల‌లోపే అత‌డి మృత‌దేహం వాషింగ్ మిష‌న్‌లో ల‌భ్యం కావ‌డం గ‌మ‌నార్హం.

United States: వాషింగ్ మిష‌న్‌లో విగ‌త‌జీవిగా కనపడ్డ ఏడేళ్ళ బాలుడు

United States: ఓ బాలుడు వాషింగ్ మిష‌న్‌లో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. త‌మ కుమారుడు క‌న‌ప‌డ‌కుండా పోయాడ‌ని అత‌డి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు ఇచ్చిన మూడు గంట‌ల‌లోపే అత‌డి మృత‌దేహం వాషింగ్ మిష‌న్‌లో ల‌భ్యం కావ‌డం గ‌మ‌నార్హం. ట్రాయ్ ఖోలెర్ అనే ఏడేళ్ళ బాలుడు అదృశ్య‌మ‌య్యాడు. ఆ స‌మ‌యంలో ట్రాయ్ తండ్రి ఇంటి వ‌ద్దే ఉన్నాడు. ట్రాయ్ త‌ల్లి ఓ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తుంది. ఆమె ఇంటికి చేరుకునే స‌రికి బాలుడు లేడు.

దీంతో అత‌డి కోసం వెతికి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ త‌ర్వాతి మూడు గంట‌ల స‌మ‌యంలో ఆ బాలుడు వాషింగ్ మిష‌న్‌లో క‌న‌ప‌డ్డాడు. అత‌డు మృతి చెందాడ‌ని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. ఆ బాలుడిని 2019లో ఓ దంప‌తులు ద‌త్త‌త తీసుకున్నార‌ని పోలీసులు తెలిపారు. బాలుడి మృతి ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని చెప్పారు. ఈ బాలుడు ఎలా చ‌నిపోయాడో తేల్చాసి ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ట్రాయ్ త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా