2014లో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం..10 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష

  • Published By: madhu ,Published On : December 7, 2019 / 07:22 AM IST
2014లో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం..10 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష

2014లో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం శివమొగ్గలోని కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. అత్యాచారం జరిపిన 32 ఏళ్ల వ్యక్తికి 10 సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష విధిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే బాధితురాలికి ప్రభుత్వం రూ. 3 లక్షల పరిహారం అందించాలని సూచించింది. 

తీర్పుపై నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పది సంవత్సరాల శిక్షేనా అని ప్రశ్నిస్తున్నారు. మరణశిక్ష ఎందుకు వేయలేదని నిలదీశారు. స్పెషల్ కోర్టు తర్వాత హైకోర్టు..అనంతరం సుప్రీంకోర్టు..చివరకు మెర్సీ పిటిషన్ అంటూ మరో నెటిజన్ విమర్శించారు. లెటెస్ట్ లాస్ ప్రకారం ఉరి శిక్ష వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడో ఓ నెటిజన్. దీనికి సంబంధించిన మరో స్కీం ఉండదని, 30 వేలు..10 సంవత్సరాల వరకు ఫ్రీ భోజనం, వసతి అంటూ ఎద్దేవా చేశారు. చాలా మంది మాత్రం మరణ శిక్ష వేయాలని, ఎన్ కౌంటర్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 
Read More : పోలీసులపై చర్యలు తీసుకోవాలి : దిశ కేసు..సుప్రీంకోర్టులో పిటిషన్
తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ చటాన్ పల్లిలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాడి జరిపి పారిపోతున్న ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పోలీసుల చర్యలను కొంతమంది మెచ్చుకోగా..పలువురు ఖండిస్తున్నారు. తాజాగా కర్నాటకలో 2014లో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారంపై స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంకా ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమౌతాయో చూడాలి.