వృధ్ధాశ్రమంలో మానసిక వికలాంగుల చిత్రహింస

  • Published By: chvmurthy ,Published On : January 24, 2020 / 05:50 AM IST
వృధ్ధాశ్రమంలో మానసిక వికలాంగుల చిత్రహింస

హైదరాబాద్ శివారు నాగారంలోని శిల్పనగర్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. మమత వృధ్ధాశ్రమం పేరుతో ఓసంస్ధ అక్రమంగా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఈ కేంద్రంలో మద్యానికి బానిసైన వారితో పాటు, ఇతర మానసిక వికలాంగులకు చికిత్స ఇస్తున్నామనే పేరుతో నిర్వాహకులు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.  

3 ఇరుకు గదుల్లో 73 మందిని గొలుసులతో బంధించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఈ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులు వికలాంగులను కర్రలతో కొడుతున్నట్లు స్ధానికులు కీసర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో  పోలీసులు దాడి చేసి వారిని ఇతర పునారావాసకేంద్రాలకు తరలించారు. ఒక్కో మానసిక వికలాంగుడి కుటుంబ సభ్యుల నుంచి నెలకు 10వేల రూపాయలు వసూలు చేస్తున్నా కనీస సౌకర్యాలు కూడా కల్పించటంలేదని బాధితులు పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  

అనుమతి లేకుండా మానసక వికలాంగ కేంద్రం నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులపై వివిధ సెక్షన్లకింద పోలీసులు కేసు నమోదు చేశారు. మానసిక వికలాంగులను ఇతర పునరావాస కేంద్రాలకు తరలించేందుకు పోలీసులు యత్నాలు చేస్తున్నారు.