Uttar pradesh : రూ. 100 లంచం కేసు..32ఏళ్లకు తీర్పు, 82 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి జైలుశిక్ష విధించిన కోర్టు

తీసుకున్నది రూ.100లు లంచం. 32 ఏళ్ల తరువాత 82 ఏళ్ల రిటైర్ట్ ఉద్యోగికి జైలు శిక్ష విధించింది కోర్టు.

Uttar pradesh  : రూ. 100 లంచం కేసు..32ఏళ్లకు తీర్పు, 82 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి జైలుశిక్ష విధించిన కోర్టు

82 year old retired employee sentenced to one year in jail

Uttar pradesh :  తీసుకున్నది రూ.100లు లంచం. 32 ఏళ్ల తరువాత కూడా ఓ రిటైర్ట్ ఉద్యోగిని వెంటాడింది ఆ పాపం. 32 ఏళ్ల క్రితం రూ.100లు లంచం తీసుకున్న పాపాని రిటైర్ అయినా అది వెన్నాడింది.82 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగికి లక్నోలోని ప్రత్యేక కోర్టు గురువారం (ఫిబ్రవరి2,2023) ఏడాది జైలుశిక్ష విధించింది. దీంతో సదరు వ్యక్తి ఏమీ చేయలేక దయచేసి నా వయస్సును పరిగణలోకి తీసుకుని శిక్ష విషయంలో తగ్గించమని కోరిని కుదరదు అని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఉత్తర్ ప్రదేశ్ లో 32 ఏళ్లకు కోర్టు ఇచ్చిన తీర్పుకు తల్లడిల్లిపోతున్నాడా 82 ఏళ్ల వృద్ధుడు. ఈ వయస్సులో జైలుశిక్ష అనుభవించాలా?అదీ రూ.100లు లంచం కేసులో అంటూ వాపోతున్నాడు. లంచం అనేది చిన్నదైనా పెద్దదైనా చేసిన తప్పుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు యూపీలోని ఓ రిటైర్డ్ ఉద్యోగి.

ఉత్తర రైల్వేలో లోకో డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు రామ్‌కుమార్ తివారి అనే వ్యక్తి. 1991లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెడికల్ సర్టిఫికెట్ కోసం రైల్వే డాక్టర్ రామ్‌నారాయణ్ వర్మ వద్దకు వెళ్లారు. దీంతో రామ్ కుమార్ కు టెస్టులు చేయించి సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ. 150లు ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయిన తనకు కూడా తెలిసిందే లంచం ఇవ్వందే సర్టిఫికెట్లు ఇవ్వరని. దీంతో రామ్ కుమార్ త్వరగా సర్టిఫికెట్ రావటానికి అంత ఇవ్వలేనని తగ్గించమని కోరారు. కానీ కుదరదని చెప్పారు రమ్ కుమార్. దీంతో తొలివిడతగా రూ. 50 ఇచ్చి తరువాత రూ. 100 ఇస్తానని చెప్పారు. సరేనని అంగీకరించారు రామ్ నారాయణ్.

కానీ రూ.100 ఇవ్వాడానికి ముందు రామ్ కుమార్ డానికి ముందు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన రూ. 100 ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రామ్ నారాయణ్ ను పట్టుకున్నారు. ఆకేసు కోర్టుకు అప్పగించారు.అలా అప్పటినుంచి విచారణ వాయిదాలు పడుతు పడుతూ కొనసాగి కొనసాగింది. ఈక్రమంలో ఎట్టకేలకు 32 ఏళ్ల తరువాత రూ.100ల లంచం కేసులో తీర్పునిచ్చింది లక్నోలోని ప్రత్యేక కోర్టు. ఈ కేసు విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ విక్రమ్ సింగ్..రామ్ నారాయణ వర్మను దోషిగా తేల్చిం సంవత్సరం జైలుశిక్ష విధించారు. దీంతో వర్మ ఇప్పుడు నా వయస్సు 82 ఏళ్లు తన వయసును దృష్టిలో పెట్టుకోవాలని..సానుభూతితో నా శిక్షను తగ్గించాలని కోరారు. పైగా ఈకేసులో ఇప్పటికే తాను రెండు రోజులు జైలులో గడిపానని కోర్టుకు విన్నవించుకున్నారు. కానీ న్యాయమూర్తి మాత్రం వర్మ విన్నపాన్ని తిరస్కరించారు. ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.