BJP Leader Attacked Ex-jawan : మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత దాష్టీకం..మాజీ జవాన్‌పై దాడి
మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఘటన మరువక ముందే ఆ పార్టీ మరో నేత దౌర్జన్యం, దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లో మరో బీజేపీ నేత రెచ్చిపోయారు. స్నేహితుడితో కలిసి మాజీ జవాన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన రేవాలో సోమవారం చోటు చేసుకుంది.

A BJP leader along with his friend attacked an ex-jawan in Rewa, Madhya Pradesh
మహిళపై దాడి చేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి ఘటన మరువక ముందే ఆ పార్టీ మరో నేత దౌర్జన్యం, దాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లో మరో బీజేపీ నేత రెచ్చిపోయారు. స్నేహితుడితో కలిసి మాజీ జవాన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన రేవాలో సోమవారం చోటు చేసుకుంది. మాజీ సైనికుడు దినేష్ మిశ్రా ఒక సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు.
బీజేపీ యూత్ లీడర్ రితురాజ్ చతుర్వేది, తన స్నేహితుడితో కలిసి బలవంతంగా ఆ షాపులోకి వెళ్లారు. అకారణంగా దినేష్ మిశ్రాపై దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా షాపులోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు లూఠీ చేశారు.
BJP Leader Threatens Woman : మహిళపై చేయిచేసుకున్న బీజేపీ నాయకుడు
ఈసంఘటన అనంతరం బాధితుడైన దినేష్ మిశ్రా దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.