Dowry Harassment Case : మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై వరకట్న వేధింపుల కేసు
మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ భార్య జ్యోతి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులు తాళలేక జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Dowry Harassment Case : మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ భార్య జ్యోతి నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలకృష్ణ వేధింపులు తాళలేక జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జ్యోతి, బాలకృష్ణ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.
అదనపు కట్నం వేధింపులే ఆత్మహత్యకు కారణమని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి డెడ్ బాడీ వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ, అతని తల్లి వేధింపుల వల్లే జ్యోతి సూసైడ్ చేసుకున్నారని ఆరోపించారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నల్లమల బాలకృష్ణ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు జ్యోతితో వివాహం జరిగింది. ఆ సమయంలోనే రూ.2 లక్షలు కట్నంతోపా కోటి రూపాయలు విలువ చేసే మూడు ఎకరాల భూమిని ఇచ్చామని జ్యోతి పుట్టింటి వారు అన్నారు. మున్సిపల్ కమిషనర్ అయిన తర్వాత మరింత కట్నం తీసుకురావాలని వేధించడం మొదలు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. మూడు నెలల క్రితం మరో ఎకరం భూమి సైతం రాసి ఇచ్చామని.. అయినా తమ కూతురితో గొడవ పడుతూనే ఉన్నారని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.