Girl Dead Body : తలలేని బాలిక మృతదేహం లభ్యం
యూపీలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. మీరట్‌లో రోడ్డుపై తలలేని ఓ బాలిక మృతదేహం లభ్యం అయింది. నగరంలోని లఖిపుర ప్రాంతంలో శుక్రవారం బాలిక మృతదేహం కనిపించింది. ఈ ఘటన లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

Six of family found dead
Girl Dead Body : యూపీలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. మీరట్‌లో రోడ్డుపై తలలేని ఓ బాలిక మృతదేహం లభ్యం అయింది. నగరంలోని లఖిపుర ప్రాంతంలో శుక్రవారం బాలిక మృతదేహం కనిపించింది. ఈ ఘటన లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాలికను వేరొక ప్రాంతంలో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని లఖిపుర ప్రాంతంలో పడేసి ఉంటారని పోలీసలు అధికారులు భావిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది.
Bihar Police : హోటల్ గదిలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
బాలిక తల ఎక్కడుందో ఇప్పటివరకూ పోలీసులు గుర్తించలేదు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్పిపోయిన బాలికల వివరాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలికను గుర్తించేందుకు పనిలో నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.