Five Died In Road Accident : అంబులెన్స్‌ను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను కారు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన బాంద్రా-వొర్లి సీ లింక్‌పై చోటు చేసుకుంది.

Five Died In Road Accident : ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను కారు ఢీ కొనడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన బాంద్రా-వొర్లి సీ లింక్‌పై చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న కారు బ్రిడ్జిపైన 76, 78 పోల్ నెంబర్ల వద్ద బుధవారం తెల్లవారుజామున అంబులెన్స్‌ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో 13 మంది గాయపడ్డారు.
ఘటన సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే ప్రమాద స్ధలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. స్ధానికుల సహకారంతో క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనతో బాంద్రా నుంచి వొర్లికి వెళ్లే రోడ్డును అధికారులు మూసివేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.