Hyderabad : మిస్డ్ కాల్ ప్రేమాయణం.. టీచర్‌తో పాటు యువకుడు బలి
హయత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లై భర్త, పిల్లలు ఉన్న ఓ ప్రభుత్వ టీచర్ యువకుడిని ప్రేమలోకి లాగింది. ఆమెకు పెళ్లైందని తెలియని అతను నిజమని నమ్మాడు. ఫలితంగా రెండు జీవితాలు ఎలా బలయ్యాయో చదవండి.

Hyderabad
Hyderabad Crime News : విద్యార్ధులకు మంచిని బోధించే టీచర్ చెడు మార్గంలో నడిచింది. తనవల్ల మరొకరి మరణానికి కారణమైంది. హయత్‌నగర్‌లో ఓ టీచర్ ఆత్మహత్య చేసుకోగా.. మరో యువకుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Hyderabad : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం
హయత్‌నగర్‌లో 45 సంవత్సరాల మహిళ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం ములుగుజిల్లా పంచోత్కులపల్లికి చెందిన రాజేష్ అనే 25 ఏళ్ల యువకుడికి తన ఫోన్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చింది. అలా వారి మధ్య జరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ టీచర్ తనకు పెళ్లైందన్న విషయం దాచిపెట్టింది. రాజేష్‌కి పెళ్లికాకపోవడంతో ఇద్దరూ చాటింగ్‌లు చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలిసి తిరిగారు. అయితే తనకు పెళ్లైనట్లుగా తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది.
ఈ నేపథ్యంలో రాజేష్ ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఆమెకు పెళ్లై చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని తెలుసుకున్నాడు. దాంతో రెండు నెలలుగా ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించింది.
తల్లి సెల్ ఫోన్‌లోని వాట్సాప్ చాట్ చూసిన ఆమె కొడుకు తల్లి ఆత్మహత్యకు రాజేష్ కారణమని నిర్ధారణకు వచ్చాడు. తల్లి చేస్తున్నట్లే రాజేష్ తో చాటింగ్ చేసి కలవడానికి రమ్మన్నాడు. కలవడానికి వచ్చిన రాజేష్ ను తన స్నేహితులతో కలిసి చితక్కొట్టాడు. అవమానం భరించలేక రాజేష్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ టీచర్ చేసిన నిర్వాకం ఆమె జీవితాన్నే కాకుండా ఆ యువకుడి జీవితాన్ని బలి తీసుకుంది.