ఆసరా పించన్ల స్కాంలో నలుగురు అరెస్ట్

  • Edited By: chvmurthy , September 17, 2019 / 11:39 AM IST
ఆసరా పించన్ల స్కాంలో నలుగురు అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో వృధ్ధుల పెన్షన్లు కాజేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృధ్దులకు ఇచ్చే ఆసరా పించన్లను కోందరు వ్యక్తులు ముఠా గా ఏర్పడి కాజేస్తున్నారు. హైదరాబాద్  జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్  పోలీసులు విచారణ జరిపి ముఠాలోని నలుగురుని అదుపులోకి తీసుకున్నారు.  

250 మందికి సంబంధించిన ఆసరా పించన్లు 3నెలలుగా డైవర్ట్ చేసి కాజేస్తున్న ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్ , సోహెల్ , అస్లాం , మోసిన్ లను పోలీసుల అరెస్టు చేశారు. ముఠా లోని అస్లాం అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి సాయంతో వీరు ఈ మోసానికి పాల్పడ్డారు.  

ముఠా సభ్యుడు అస్లాం 2017 లో జరిగిన పించన్ స్కాంలో అరెస్టై  జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. వీరు నలుగురు కాక మరి కొందరు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు సీసీఎస్  పోలీసులు తెలిపారు.