Minor Girl: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ప్రియుడు.. ఆపై బ్యాగులో కుక్కి అడవిలో పడేసిన నిందితుడు

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఒక నిందితుడు. తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. అయినా, ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది.

Minor Girl: బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ప్రియుడు.. ఆపై బ్యాగులో కుక్కి అడవిలో పడేసిన నిందితుడు

Minor Girl: అసోంలో దారుణం జరిగింది. ఒక అమ్మాయిని ప్రియుడే కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. కానీ, ఆ బాలిక ఇంటికి తిరిగొచ్చింది. ఈ ఘటన గత వారం అసోంలోని సిల్చార్ పట్టణ సమీపంలోని, మొయినాఘర్ ప్రాంతంలో జరిగింది.

Viral Video: షో రూం నుంచి అప్పుడే ఇంటికొచ్చిన కొత్త కారు.. ఎంత పని చేసింది? వీడియోలో రికార్డైన అనూహ్య ఘటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మైనర్ బాలిక ఇటీవల దుర్గా పూజకు ఒక యువకుడితో కలిసి హాజరైంది. తరచూ ఆ బాలిక అతడితోనే పూజకు వెళ్తుండేది. అయితే, వేరే వ్యక్తితో బాలిక పూజకు వెళ్లడం 26 ఏళ్ల ఒక వ్యక్తికి ఇష్టం లేదు. దీంతో కోపం తెచ్చుకున్న అతడు.. బాలిక పూజ చేసి తిరిగొస్తుండగా, రాత్రి పూట ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలికను చంపాలనుకున్నాడు. పదునైన కత్తితో ఆమె గొంతు కోశాడు. వెంటనే బాలిక స్పృహ కోల్పోగా, ఒక బ్యాగులో కుక్కి, అక్కడి అటవీ ప్రాంతంలో పడేసి వచ్చాడు. అయితే, గాయాలపాలైనప్పటికీ బాలిక ప్రాణాలతోనే ఉంది. ఎలాగైనా అక్కడ్నుంచి తప్పించుకోవాలి అనుకుంది.

Glass Shards In Pizza: పిజ్జాలో గాజు ముక్కలు వచ్చాయని కంప్లైంట్ చేసిన కస్టమర్.. పోలీసులు ఏం చెప్పారో తెలుసా

అతి కష్టం మీద బ్యాగులోంచి బయటపడి, ఎలాగోలా ఇల్లు చేరుకుంది. ఇంటికొచ్చేసరికి బాలిక గాయాలతో, దుస్తులు చిరిగిపోయి ఉంది. వెంటనే బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం బాలిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు నిందితుడు.. ఆ బాలిక తన ప్రేయసి అని చెప్పాడు. తనకు ఇష్టం లేకుండా బాలిక వేరే వ్యక్తితో పూజకు వెళ్లడం వల్లే ఈ ఘటనకు పాల్పడ్డట్లు చెప్పాడు. నిందితుడిపై కిడ్నాప్, రేప్, హత్యాయత్నం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.