సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు, దుబాయ్‌లో ఉండే రాజుపై లుకౌట్ నోటీసు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

  • Published By: naveen ,Published On : June 9, 2020 / 08:19 AM IST
సీఎం కేసీఆర్‌పై అనుచిత పోస్టులు, దుబాయ్‌లో ఉండే రాజుపై లుకౌట్ నోటీసు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడి పేరు పణ్యాల రాజు. దుబాయ్ లో ఉంటాడు. రాజుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 188, 505, 469, 54 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే పణ్యాల రాజుపై లుకౌట్ నోటీసు జారీ చేశారు పోలీసులు.

సీఎం కేసీఆర్ మృతి చెందారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు రావడం కలకలం రేపింది. దీనిపై టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ సోమవారం(జూన్ 8,2020) సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్ కరోనాతో మృతి చెందారంటూ పన్యాల రాజు అనే వ్యక్తి అకౌంట్ నుంచి ఫేస్ బుక్ లో పోస్టులు వచ్చాయి. వీటిని ఇతర సోషల్‌ మీడియాలో కూడా సర్క్యులేట్‌ చేశారు. ఈ పోస్టులతో దేశ, విదేశాల్లోని తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారని శ్రీనివాస్ యాదవ్ తన ఫిర్యాదులో తెలిపారు. దీనిపై ఏసీపీ ప్రసాద్‌ నేతృత్వంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా సీఎంపై వచ్చిన తప్పుడు ఫొటోలు, నకిలీ వార్తలను పోలీసులు పరిశీలించారు. వెంటనే ఆ పోస్టులను డిలీట్‌ చేయాలని ఫేస్‌బుక్‌ యాజమాన్యానికి సైబర్‌ క్రైమ్ పోలీసులు మెయిల్ పంపారు. పోస్టులు పెట్టింది ఎవరనేదానిపై ఆరా తీశారు. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సైబర్‌ క్రైమ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read: ప్రభాస్ గెస్ట్ హౌస్ పై కూకట్ పల్లి కోర్టులో నేడు ట్రయల్