Exhinition Society : ఎగ్జిబిషన్ సొసైటీలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలు మూడవ రోజు కూడా కొనసాగుతున్నాయి.

10TV Telugu News

Exhinition Society : హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో గత రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలు మూడవ రోజు కూడా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఈరోజు సోసైటీ ఆఫీస్ సెక్షన్ లో ఫైళ్లను పరిశీలిస్తున్నారు.

సొసైటీ కాలేజి మేనేజిమెంట్,మెంబర్ల నియామకంతో పాటు మరో 7 అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మూడు సొసైటీలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ  ఎకనామికల్, ఉస్మానియా గ్రాడ్యుయేట్, ఎగ్జిబిషన్ సొసైటీల వివరాలను పరిశీలిస్తున్నారు.

గత ఆరేళ్లుగా సొసైటీలో జరిగిన కార్యకలాపాలపై దృష్టి సారించారు. మాజీ మంత్రి ఈటల చైర్మన్‌గా ఉన్నసమయంలో అవకతవకలు జరిగాయని భావిస్తున్నారు. అవతకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే ఈటలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయనున్నారు.

10TV Telugu News