అక్రమ మద్యం వ్యాపారం కోసం.. పులి, పిల్లలను చంపేశారు! అసలేం జరిగిందంటే?

  • Published By: srihari ,Published On : June 26, 2020 / 02:23 PM IST
అక్రమ మద్యం వ్యాపారం కోసం.. పులి, పిల్లలను చంపేశారు! అసలేం జరిగిందంటే?

చంద్రపూర్ జిల్లాలో ఒక పులి, దాని రెండు పిల్లలు చనిపోయాయి. సరిగ్గా వారం తర్వాత ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. పులి భయం కారణంగా అక్రమ మద్యం వ్యాపారం చేయలేకపోతున్నామనే కారణంతోనే నిందితులు ప్రెడెటర్ పులి, దాని పిల్లలను చంపినట్టు తమ దర్యాపులో తేలిందని అధికారులు వెల్లడించారు. అటవీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్.. కొండెగావ్ గ్రామానికి చెందిన సూర్యభన్ ఠాక్రే (60), శ్రావన్ మాదావి (47), నరేంద్ర దద్మల్ (49) అనే ముగ్గురు నిందితులు ఈ ప్రాంతంలో అక్రమ మద్యాన్ని తయారు చేస్తున్నారు. 

సాధారణంగా అడవి పందిని చంపడానికి మహువా పువ్వుల మొలాసిస్ మీద (వ్యవసాయంలో వాడే పురుగు మందు) థైమెట్ ఉంచారు. ఒక అడవి పందిని వేటగాళ్లు ఇదే మందుతో చంపేశారు. అక్రమ మద్యాన్ని తయారుచేసే నిందితులు కూడా ఇలానే పులిని చంపాలని నిర్ణయించుకున్నారు. చనిపోయిన అడవి పంది మృతదేహంపై థైమెట్ (విషం) పెట్టారు. అదే ప్రాంతంలో పులి తిరుగుతుందోని వారికి తెలుసు. పులి భయం లేకుండా తమ మద్యం వ్యాపారం కొనసాగించాలని భావించారు. 

అనుకున్నట్టుగానే పులి చనిపోయిన అడవి పంది దగ్గరికి వచ్చింది.. పులి, తన పిల్లలతో కలిసి అడవిపందిపై ఉన్న విషాన్ని తినడంతో వెంటనే చనిపోయినట్టు అధికారులు దర్యాప్తులో వెల్లడించారు. జూన్ 10న తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR) లోని బఫర్ జోన్ లోని సీతారాంపేత్ గ్రామానికి సమీపంలో పులి చనిపోయింది. జూన్ 14న, దాని రెండు పిల్లలు కూడా సమీపంలో చనిపోయి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.