Sai Dharam Tej : ప్లీజ్.. నాకు డబ్బులు పంపండి.. జస్ట్ రూ.15వేలే.. మెగా హీరో నుంచి మేసేజ్‌లు

''నేను... మీ సాయి ధరమ్ తేజ్ ని.. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నా.. వీలైతే డబ్బులు పంపించండి. పైగా ఎక్కువేమీ కాదు. జస్ట్ 10-15 వేలు మాత్రమే'' అని వాట్సాప్ లో కొందరికి మేసేజ్ లు వచ్చాయి.

Sai Dharam Tej : ప్లీజ్.. నాకు డబ్బులు పంపండి.. జస్ట్ రూ.15వేలే.. మెగా హీరో నుంచి మేసేజ్‌లు

Sai Dharam Tej

Sai Dharam Tej : మెగా హీరో అంటున్నారు.. మరి.. డబ్బులు పంపాలని వేడుకోవడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ. మ్యాటర్ ఏంటంటే.. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ప్రముఖుల పేర్లు, ఫొటోలతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి పేర్లతో ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, అభిమానుల దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఫ్రాడ్స్ అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. కేటుగాళ్ల బారిన పడ్డారు. ఆయనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

tej

”నేను… మీ సాయి ధరమ్ తేజ్ ని.. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నా.. వీలైతే డబ్బులు పంపించండి. పైగా ఎక్కువేమీ కాదు. జస్ట్ 10-15 వేలు మాత్రమే” అని వాట్సాప్ లో కొందరికి మేసేజ్ లు వచ్చాయి. వాస్తవానికి అది తేజ్ కాదు. మరెవరో. తన పేరుతో డబ్బులు అడుగుతున్న విషయం సాయి ధరమ్ తేజ్ కి తెలిసింది. దీంతో వెంటనే స్పందించారు.

“ఓ వ్యక్తి నాలా మారి, నాకు తెలిసిన కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నాడు. నాతో కలిసి నటించిన వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం అడుగుతున్నాడు. డబ్బులు పంపాలంటున్నాడు. అది నేను కాదు. మరెవరో. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి” అని స్వయంగా సాయి ధరమ్ తేజ్ పోస్టు పెట్టారు. తన పేరుతో డబ్బులు అడుగుతున్న విషయాన్ని తెలుపుతూ వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టారు. జాగ్రత్త..మోసపోవద్దు..అంటూ.. తన పరిచయస్తులను, స్నేహితులను, అభిమానులన అలర్ట్ చేశారు.

tej

ఇలా తన పేరిట జరుగుతున్న ఆన్ లైన్ మోసాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తేజ్. ఈ కష్టకాలంలో ఆపన్నులకు సాయం చేసే అవకాశం తమకు ఇవ్వాలని, ఇలా అడ్డదారులు తొక్కి, నిజంగా సాయం అర్థించే వాళ్లకు తమ సాయాన్ని దూరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు తేజ్. కాగా, ఆన్ లైన్ లో మోసాలు పెరిగాయి. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఓకే చేయగానే అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ దందా షురూ చేస్తారు. ఏమాత్రం తొందరపడి డబ్బులు ట్రాన్సఫర్ చేశామో.. ఇక అంతే సంగతులు. అందుకే, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపినా, డబ్బులు అడిగినా.. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి వాటి గురించి అప్రమత్తంగా ఉండాలంటున్నారు.