ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం… ప్రముఖ హోటల్ లో సెక్స్ దందా
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.

మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు. ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను నాగ్‌పూర్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఇద్దరు యువతులను రక్షించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ కేంద్రంగా ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా పథకం ప్రకారం పట్టుకున్నారు.
నాగ్‌పూర్‌లోని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలోని ఓయో హోటల్‌పై పోలీసులు రైడ్ చేశారు. తుషార్ అలియాస్ సుల్తాన్ పరస్వానీ, నీలేష్ నాగ్‌పురె, రజత్ డోంగ్రే అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. సెక్స్ రాకెట్ నిర్వహకుడైన తుషార్ 2018లో కూడా ఇదే ఆరోపణలపై అరెస్టై జైలు కెళ్లాడు.
కోల్‌కతాకు చెందిన పలువురు ఏజెంట్లతో సత్సంబంధాలున్న తుషార్.. వ్యభిచారం చేసేందుకు ఓ అమ్మాయిని పంపించాలని వారిని సంప్రదించాడు. దీంతో ఫిబ్రవరి 28న విధుల్లో భాగంగా నాగ్‌పూర్ చేరుకున్న ఓ ఎయిర్ హోస్టెస్ వార్ధా సమీపంలోని ఓయో హోటల్‌లో బస చేసింది. మరుసటి రోజు ఆమెను రజత్ కలుసుకుని… ఇద్దరు కస్టమర్లను గదికి పంపించాడు. వారి దగ్గర నుంచి రూ.15వేలు వసూలు చేసి యువతికి రూ.4వేలు మాత్రమే ఇచ్చాడు.
తుషార్ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఓ నకిలీ విటుడి ద్వారా అతడిని సంప్రదించారు. తన వద్ద అందమైన ఎయిర్ హోస్టెస్ ఉందని చెప్పిన తుషార్ అతడిని హోటల్‌కు రావాలని సూచించాడు. కొద్దిసేపటికే తుషార్, రజత్, ఎయిర్ హోస్టెస్‌తో పాటు మరో యువతి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గణేశ్‌పేట్ పోలీస్‌స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.