Woman Nude Photos : మహిళను వేధిస్తోన్న టీనేజీ లవ్.. ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలు!

ఒకప్పటి టీనేజీ లవ్ ఇప్పటికీ ఆ మహిళను వెంటాడుతూనే ఉంది. ఆన్ లైన్ లో తొలగించిన నగ్న చిత్రాలు మళ్లీ బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన మహిళకు ఈ ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించడం మానసిక వేదనకు గురిచేస్తోంది.

Woman Nude Photos : మహిళను వేధిస్తోన్న టీనేజీ లవ్.. ఆన్‌లైన్‌లో నగ్న చిత్రాలు!

Again Woman Nude Photos

Woman nude photos : ఒకప్పటి టీనేజీ లవ్ ఇప్పటికీ ఆ మహిళను వెంటాడుతూనే ఉంది. ఆన్ లైన్ లో తొలగించిన నగ్న చిత్రాలు మళ్లీ బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయిన మహిళకు ఈ ఫొటోలు ఆన్ లైన్ లో కనిపించడం మానసిక వేదనకు గురిచేస్తోంది. నగ్న ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో నుంచి తొలగించాలంటూ గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ కంపెనీలు ఎన్నోసార్లు లేఖ ద్వారా మొరపెట్టుకుంది.

అయినప్పటికీ తన ఫొటోలను డిలీట్ చేయలేదు. దాంతో బాధితురాలి తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పెళ్లికి ముందు ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి నగ్న ఫొటోలను తీసుకున్నాడని, 8 నెలల తర్వాత వారిద్దరూ విడిపోయారని తెలిపారు. తన కుమార్తె పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడిందని, ఆమెకు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడని తెలిపింది. డెంటల్ కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయని బాధితురాలు వాపోయింది.

2012లో ప్రేమికుడు ఆమె ఫొటోలను సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్‌లో పెట్టాడని ఫిర్యాదు చేయడంతో అప్పుడే తొలగించారని, కానీ, 2019లో తిరిగి మళ్లీ ఆమె ఫొటోలు కనిపించాయన్నారు. దీనిపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌కు లేఖలు రాసినా స్పందించడం లేదన్నారు. ఈ ఫొటోలను తాను సోషల్ మీడియాలో పెట్టలేదని ప్రేమికుడు చెబుతున్నాడన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి నిందితులపై ఫిర్యాదుకు సంబంధించి దర్యాప్తు ఏ దశలో ఉంది? నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ సైబర్‌క్రైమ్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

గూగుల్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ స్నేహితుల వల్ల వ్యక్తిగత డేటా దుర్వినియోగానికి గురవుతున్నందున ప్రైవసీకి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బాధితురాలి లేఖపై ఎందుకు చర్య తీసుకోలేదో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులపై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు వినతి పత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.