ఎయిర్ ఇండియాకు భారీ ఫైన్ : దంపతులకు నాన్‌వెజ్ సర్వ్

మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది.

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 07:54 AM IST
ఎయిర్ ఇండియాకు భారీ ఫైన్ : దంపతులకు నాన్‌వెజ్ సర్వ్

మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది.

ప్రముఖ దేశీయ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా పడింది. మతపరమైన భావాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకుగానూ ఎయిర్ ఇండియాకు రూ.40వేలు జరిమానా చెల్లించాల్సిందిగా పంజాబ్ కంజ్యూమర్ డిస్ ప్యూట్స్ రీడ్రెసల్ కమిషన్ (PCDRC) ఆదేశించింది. చికాగో నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న శాఖాహారులైన దంపతులకు మాంసాహారాన్ని సర్వ్ చేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటన 2016లో నవంబర్ 14న జరిగింది. తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన ఎయిర్ ఇండియాపై బాధిత దంపతులు PCDRCను ఆశ్రయించారు. దీనిపై విచారించిన కంజ్యూమర్ ఫారమ్.. ఎయిర్ ఇండియా నిర్లక్ష్యపు సర్వీసులను తప్పుబట్టింది. 

తొలుత రూ.10వేలు విధించిన జరిమానాను నాలుగంతలు చేస్తూ మొత్తంగా రూ.40వేలకు పెంచింది. దంపతులకు న్యాయపరమైన ఖర్చులకు అదనంగా రూ.7వేలు వరకు చెల్లించాలని ఆదేశించింది. కమిషన్ ఆదేశాలు అందిన 30రోజుల్లో బాధిత దంపతులకు జరిమానా మొత్తాన్ని చెల్లించాలని ఎయిర్ ఇండియాకు సూచించింది. సరైన సమయానికి జరిమానా చెల్లించిన పక్షంలో 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. పంజాబ్ లోని మొహాలి సెక్టార్ 121కు చెందిన చంద్ర మోహన్ పతాక్ తన భార్యతో కలిసి న్యూఢిల్లీ నుంచి చికాగోకు వెళ్లేందుకు జూన్ 17, 2016న ఒకసారి.. నవంబర్ 14, 2016న చికాగో నుంచి న్యూఢిల్లీకి వచ్చేందుకు (రానుపోను) ఎయిర్ ఇండియా నుంచి ఫ్రో టికెట్లు బుక్ చేసుకున్నారు. 

విమానం ప్రయాణం సమయంలో ముందుగానే ఫిర్యాదుదారుడు పతాక్.. తాను.. తన భార్య వెజిటేరియన్స్ ఫుడ్ మాత్రమే తింటామని ఎయిర్ లైన్ సిబ్బందికి స్పష్టంగా వివరణ ఇచ్చాడు. న్యూఢిల్లీ-చికాగో విమానంలో రిటర్న్ జర్నీ చేస్తున్న సమయంలో విమాన సిబ్బంది ఒకరు దంపతులకు నాన్ వెజ్ సర్వ్ చేశారు. ఆ విషయం తెలియని వారిద్దరూ ఫుడ్ తింటుండగా.. టెస్టు డిఫరెంట్ అనిపించింది. ఫుడ్ లో మాంసం ముక్క కనిపించడం చూసి షాక్ అయినట్టు తమ ఫిర్యాదులో తెలిపారు. వెంటనే ఆ విషయాన్ని క్యాబిన్ క్ర్యూ దృష్టికి తీసుకెళ్లారు. నాన్ వెజిటేరియన్ లేదా వెజ్ టేరియన్ అని తెలిసేలా ఫుడ్ ప్యాకెట్లపై ఎలాంటి మార్క్స్ లేవని మండిపడ్డారు. దీనిపై రాతపూర్వకంగా ఎయిర్ లైన్ కు కంప్లయింట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 

కానీ, అందుకు అవకాశం లేదు. విమానం దిగాక నేరుగా కంజ్యూమర్ ఫారమ్ కు వెళ్లి దంపతులు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై విచారించిన కంజ్యూమర్ ఫారమ్.. ఏప్రిల్ లో ఎయిర్ ఇండియాకు రూ.10వేలు జరిమానా విధించింది. న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.7వేలు నష్టపరిహారం విధించింది. కానీ, ఎయిర్ ఇండియా స్టేట్ కంజ్యూమర్ కమిషన్‌లో సవాల్ చేసింది. అక్కడ కూడా ఎయిర్ ఇండియా సర్వీసును మందలిస్తూ బాధిత దంపతులకే అనుకూలంగా తీర్పు వచ్చింది. విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు ఫుడ్ సర్వ్ చేసే సమయంలో క్యాబిన్ క్ర్యూ ఒకటికి రెండుసార్లు ఫుడ్ ప్యాకెట్లను చెక్ చేసుకోవాలని ఫారమ్ సూచించింది.