అక్కన్నపేట కాల్పుల కేసు : పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పిన సదానందం

అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందాన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 14, 2020 / 02:18 AM IST
అక్కన్నపేట కాల్పుల కేసు : పోలీసు విచారణలో కీలక విషయాలు చెప్పిన సదానందం

అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందాన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది.

అతడికి గన్స్‌ అంటే మోజు. గన్స్‌తో షూట్‌ చేయడమంటే అతనికి సరదా. గన్స్‌పైనున్న మోజు, సరదానే అతడిని నిందితుడిగా మార్చాయి. ఏకంగా పీఎస్‌ నుంచి గన్స్‌ను ఎత్తుకెళ్లేలా చేశాయి.  అపహరించిన ఆయుధాలతో ఇద్దరిని మట్టుబెట్టేందుకు కూడా అతడు ప్రయత్నించి విఫలమయ్యాడు. అక్కన్నపేట కాల్పుల నిందితుడు సదానందం పోలీసులు విచారణలో పలు కీలక అంశాలు వెల్లడించాడు. 

సదానందంపై పోలీసుల ప్రశ్నల వర్షం
అక్కన్నపేట కాల్పుల ఘటన నిందితుడు సదానందం పోలీసులు విచారణలో పలు కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. సదానందాన్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గన్స్‌ ఎలా తీసుకెళ్లావన్న దానిపైనే పోలీసులు సదానందంపై ప్రశ్నల వర్షం కురిపించారు.  దీంతో సదానందం  పోలీసుల వరుస ప్రశ్నలకు నోరువిప్పాడు.

గన్స్‌పైనున్న మోజుతోనే ఆయుధాల అపహరణ
గన్స్‌పై తనకున్న మోజుతోనే  అపహరించినట్టు పోలీసు విచారణలో సదానందం అంగీకరించినట్టు తెలుస్తోంది. పీఎస్‌లో సిబ్బంది అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆయుధాలను తీసుకెళ్లినట్టు పోలీసులు విచారణలో తేలింది. పోలీస్‌ స్టేషన్‌ వెనుకడోర్‌ నుంచి వచ్చి… ఎత్తుకెళ్లినట్టు నిందితుడు సదానందం పోలీసులకు తెలిపాడు.

పంచాయతీ కేసుల్లో హుస్నాబాద్‌ పీఎస్‌కు పలుమార్లు వచ్చిన సదానందం
పంచాయతీ కేసుల్లో పలుమార్లు హుస్నాబాద్‌ పీఎస్‌కు వచ్చినట్టు నిందితుడు సదానందం పోలీసులకు తెలిపాడు. అప్పుడే గన్స్‌ తస్కరించాలన్న కోరిక పుట్టినట్టు చెప్పాడు. అయితే అవకాశం చాలా రోజులు ఎదురుచూశానని వివరించాడు.  చివరికి సిబ్బంది అజాగ్రత్తగా ఉండడం గమనించి ఆయుధాలను అపహరించుకుపోయినట్టు తెలిపాడు.

గన్స్‌తో ఇద్దరిని చంపడానికి ప్రయత్నం
అయితే గన్స్‌ ఎత్తుకెళ్లడానికి కారణాలు కూడా ఉన్నాయని సదానందం పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. గన్స్‌పై తనకు చిన్నప్పటి నుంచే మోజు ఉందని పోలీసులకు చెప్పాడు. అందుకే వాటిని అపహరించుకుపోయానని వివరించాడు. తీసుకెళ్లిన గన్స్‌తో ఇద్దరిని కాల్చివేయడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. అప్పు తీర్చని  ఓ మహిళతోపాటు , ఇటుకల కోసం తనతో గొడవ పడిన మరో వ్యక్తిని అంతం చేయాలని భావించాడు. అయితే ఈ నేపథ్యంలోనే అతడు పోలీసులకు చిక్కాడు.