Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్​ఖైదా కుట్ర

అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది.

Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్​ఖైదా కుట్ర

Attack

Al Qaeda conspiracy : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్​ఖైదా కుట్ర పన్నుతోంది. అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు ప్రణాళికలు రచిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్ర హోంశాఖ.. అధికారులను అలర్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్‌ సంస్థలు భారత్​పై దాడులకు కుట్రలు పన్నుతున్నాయి. మతపరమైన స్థలాలపై, భద్రతా దళాలపై దాడులు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ విభాగం భారీ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ గుజ్జర్​ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నెల ప్రారంభంలో కిష్టావర్ జిల్లాలో ఆర్మీ, కశ్మీర్​ పోలీసులు కలిసి.. గుజ్జర్‌ను అరెస్టు చేశారు. జమ్ము కశ్మీర్​లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులను చేర్చుకునేందుకు గుజ్జర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జమ్ము కశ్మీర్​, ఈశాన్య భారతదేశంలో అల్​ఖైదా ఇండియన్ సబ్​కాంటినెంట్ యాక్టివ్​గా ఉంది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మధ్య భారతంలోనూ ఉగ్రమూకల ఆనవాళ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన బేస్‌ పెంచుకునేందుకు అల్​ఖైదా ప్రయత్నిస్తోంది.

Terrorists Attack : నైజీరియాలో చర్చిపై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి

అమర్​నాథ్ యాత్రికులు, వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులే లక్ష్యంగా దాడులకు యత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా వివిధ సెక్యూరిటీ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. మతపరమైన ప్రదేశాల వద్ద అదనపు భద్రత కల్పించాలని, పర్యవేక్షణ పెంచాలని ఆదేశాలు ఇచ్చింది. భారతదేశ భద్రతకు విఘాతం కలిగించే చర్యలన్నింటినీ భగ్నం చేయాలని సూచించింది.

జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు అమర్​నాథ్ యాత్ర సాగనుంది. ఇప్పటికే అమర్​నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో 43 రోజుల పాటు సాగే అమర్​నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. 300 కంపెనీల పారమిలిటరీ దళాలను మోహరించింది.