అంకిత్ శర్మ హత్య : ఆ వీడియోలో ఉన్నది ఆప్ కౌన్సిలర్ తాహీర్‌?

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 08:58 AM IST
అంకిత్ శర్మ హత్య : ఆ వీడియోలో ఉన్నది ఆప్ కౌన్సిలర్ తాహీర్‌?

తాహీర్..తాహీర్..ప్రస్తుతం ఈ పేరుపై ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తాహీర్ పేరు తెరమీదకు వచ్చింది. అసలు ఈ తాహీర్ ఎవరు ? అంకిత్ శర్మ, ఢిల్లీ అల్లర్ల వెనుక ఇతని పేరు ఎందుకు వినిపిస్తోంది ? తాహీర్ హుస్సేన్ కేజ్రీవాల్ పార్టీకి చెందిన లీడర్. ఇతను ఆప్ కౌన్సిలర్. ఢిల్లీలో మూడు రోజుల పాటు చెలరేగిన విధ్వంసం తర్వాత…ప్రస్తుతం కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి.

ఈ వీడియోలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. రాళ్లు రువ్వడం, పెట్రోల్ బాంబులు విసిరారంటూ..తాహీర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. అందులో ప్రధానమైంది ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య. తాహీర్ అనుచరులు తన కొడుకును హత్య చేశారంటూ..అంకిత్ ఫాదర్ చెబుతున్నాడు. తాహీర్ నివాసంపై ఎంతోమంది అనుచరులు పెట్టుకున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. 

అంకిత్ శర్మ హత్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఘర్షణలో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా ఆయన్ను హత్య చేశారు. మూడు రోజుల తర్వాత ఆయన మృతదేహం కాల్వలో లభ్యమైంది. ఆరోపణలను తాహీర్ ఖండిస్తున్నారు. కపిల్ మిశ్రా ఇంటికి సమీపంలోనే మొదట అల్లర్లు జరిగాయని పేర్కొంటున్నారు ఆయన. 
అంకిత్ మృతికి తనకు సంబంధం లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Read More : హైదరాబాద్‌లో CPI నిరసన : అమీత్ షా దిష్టిబొమ్మ దగ్దాన్ని అడ్డుకున్న పోలీసులు