జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

  • Published By: madhu ,Published On : February 7, 2019 / 11:02 AM IST
జయరాం కేసులో ఉత్కంఠ : జూబ్లిహిల్స్ పీఎస్‌లో నమోదు కాని ఎఫ్ఐఆర్ 

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసుకు ఫుల్ స్టాప్ పడడంలేదు. రాకేశ్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని పేర్కొన్న ఏపీ పోలీసులు…ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. అయితే…కేసుకు సంబంధించిన దానిపై జయరాం ఫ్యామిలీ పలు సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని..కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని వెల్లడించిన జయరాం భార్య పద్మశ్రీ జూబ్లిహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ నుండి తెలంగాణకు కేసు బదిలీ అయ్యిందని ప్రచారం జరిగింది. 

రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడు…శిఖా చౌదరి పాత్ర ఏమీ లేదని ఏపీ పోలీసులు వన్ సైడైడ్‌గా ఎలా తేలుస్తారని పద్మశ్రీ ప్రశ్నిస్తున్నారు. ఇందులో శిఖా పాత్ర ఖచ్చితంగా ఉందని..దర్యాప్తును తెలంగాణ పోలీసులు చేపట్టాలని కోరారు. కానీ…ఆ రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతుంటే…తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయరని జూబ్లిహిల్స్ కాప్స్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ పోలీసులు కేసును బదిలీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా…జూబ్లిహిల్స్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. మరి కేసును తెలంగాణకు బదిలీ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి.