Andhra pradesh : యాక్సిడెంట్ అయిన కారులో ఆరు బస్తాల గంజాయి

ఆంధప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ కారు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ అయిన కారులో ఆరు బస్తాల గంజాయిని గుర్తించారు పోలీసులు.

Andhra pradesh : యాక్సిడెంట్ అయిన కారులో ఆరు బస్తాల గంజాయి

Andhra pradesh : ఆంధప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ కారు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లినట్లుగా ప్రమాదం జరిగిన దృశ్యాన్ని చూస్తే తెలుస్తోంది. కాగా కారులో మాత్రం ఎవ్వరులేరు. ప్రమాదానికి గురి అయిన కారును వదిలేసి పోయారు కారులో ప్రయాణించే వ్యక్తులు. ఎందుకంటే కారులో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదం మాట దేవుడెరుగు దొరికితే అడ్డంగా బుక్ అయిపోతామనుకున్న సదరువ్యక్తులు కారును అక్కడే వదిలేసి పరారైపోయారు.

Andhra Pradesh: రూ.15వందల కోట్ల గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు

అల్లూరు జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డు కారు ప్రమాదం జరిగిందని సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. కారు ప్రమాదాన్ని చూస్తే ఎవరవన్నా ప్రాణాలు పోయాయా? లేదా గాయపడ్డారా? అనేటట్లుగా ఉంది. కానీ కారులో గానీ ఆ చుట్టుపక్కల గానీ ఎవ్వరూ లేరు. దీంతో పోలీసులు కారుని పరిశీలించగా కారులో ఆరు బస్తాల గంజాయి ఉంది. గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా కారు ప్రమాదానికి గురి అయ్యిందని అందుకే పట్టుబడతామనే భయంతో కారును వదిలి సదరు వ్యక్తులు పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాదం జరగటం..కారులో ఆరు బస్తాల గంజాయి ఉండటం చూస్తే అదే నిజమని నిర్ధారణ అవుతోంది.కారు నంబరు ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. యాక్సిడెంట్ లో భాగంగా కారు డోర్లు ఓపెన్ అయి కొన్ని గంజాయి ప్యాకెట్స్ బయట చెల్లా చెదురుగా పడిపోయాయి. గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Andhra Pradesh: ఏపీలో రూ.300 కోట్ల విలువైన గంజాయి ధ్వంసం.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ పరివర్తన్’

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా..ఎంతగా నిఘా పెడుతున్నా ఇటువంటి అక్రమాలు కొనసాగుతునే ఉన్నాయి. స్మగ్లర్లు కొత్త కొత్త ప్లాన్లుతో అక్రమ రవాణాలు కొనసాగిస్తునే ఉన్నారు.